ఎన్నికల ముందు చంద్రబాబు కి ఊహించని దెబ్బ..?

By Xappie Desk, December 28, 2018 12:06 IST

ఎన్నికల ముందు చంద్రబాబు కి ఊహించని దెబ్బ..?

2019 ఎన్నికలలో పార్టీ తరఫున నిలబడే అభ్యర్థుల విషయంలో పగడ్బందీగా ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో వారి పనితనాన్ని వారి నియోజకవర్గంలో ఉండే ప్రజల దగ్గర నుండి సమాచారం సేకరించి ఎన్నికల విషయంలో టికెట్ ఇవ్వాలో ఇవ్వకూడదో అనే స్పష్టత ఉంటుందని ఇటీవల పార్టీ నాయకుల వీడియో కాన్ఫరెన్స్లో తేల్చిచెప్పారు చంద్రబాబు. స్వయంగా చంద్రబాబు చేస్తున్న సర్వే బట్టి జనవరిలో టిడిపి తరఫున నిలబడే అభ్యర్థుల జాబితా విడుదల అవుతుందని అంటున్నారు టిడిపి పార్టీకి చెందినవారు.

ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చంద్రబాబు చేస్తున్న సర్వే పై ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. అయితే చంద్రబాబు సర్వేలో ఇప్పటికే చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పై వ్యతిరేకత వచ్చినట్లు బయటకి వచ్చిన విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో చంద్ర‌బాబు చేయించిన స‌ర్వేలో మా పేరు వుంటే ఈ సారి ఎన్నిక‌ల్లో టికెట్ రాన‌ట్టే అని భావిస్తున్న కొంత మంది ఈ గండం నుంచి గ‌ట్టెక్క‌డం ఎలా అని త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నార‌ట‌. టికెట్ రాద‌ని ఫిక్స‌యిపోయిన కొంత మంది మాత్రం ఇప్ప‌టికే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని, త్వ‌ర‌లోనే వారంతా బాబుకు షాక్ ఇవ్వ‌బోతున్నార‌ని ఏపీలో జోరుగా వినిపిస్తోంది.

ఈ సారి ఎన్నిక‌ల్లో యువ‌త‌కు పెద్ద‌పీట వేస్తామంటూ చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌క‌ట‌న కూడా సీనియ‌ర్ల‌లో అస‌హ‌నాన్ని క‌లిగిస్తోంది. దీంతో చాలా మంది పార్టీని వీడే ఆలోచ‌న‌లో వున్నార‌ట‌. దాదాపు 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు అని సమాచారం. ఏకంగా 25 మంది పార్టీని ఎన్నికల ముందు వీడి ఇతర పార్టీలో చేరితే కచ్చితంగా చంద్రబాబుకి ఎన్నికల ముందు తెలంగాణ ఎన్నికల ఫలితాల దెబ్బ తో పాటు ఈ జంపింగ్ ఎమ్మెల్యేల దెబ్బ కూడా టిడిపి పార్టీ పై ప్రభావం చూపుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.Top