దయచేసి నన్ను వదిలేయండి అంటూ దండం పెట్టేసిన బండ్ల గణేష్..!

By Xappie Desk, December 28, 2018 12:26 IST

దయచేసి నన్ను వదిలేయండి అంటూ దండం పెట్టేసిన బండ్ల గణేష్..!

తెలంగాణ ఎన్నికల సమయంలో ఫలితాల రాకముందు ఇంటర్వ్యూలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు బండ్ల గణేష్ రెండోసారి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే మాత్రం తానూ బ్లేడ్ తో తన గొంతు కోసుకొని చచ్చిపోతానని మీడియా సాక్షిగా ప్రమాణం చేశాడు. ఆ వార్త అందరికి తెలుసు. తానూ అనుకున్నట్లుగా కాంగ్రెస్ అధికారం లోకి రాకపోగా, తను చేసిన సంచలన వాఖ్యలు మాత్రం ఇపుడు తన మరణం మీదకి తెచ్చాయని చెప్పుకోవాలి.

ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే రోజు మీడియా కి చెందిన ఒక వ్యక్తి నిజంగానే బ్లేడ్ తీసుకోని తన ఇంటికి వెళ్లి హల్చల్ చేశాడు. అదీకాక ఇప్పటికి కూడా బండ్ల గణేష్ చేసిన వాఖ్యలు మీద పలువురు వ్యక్తులు విమర్శలు చేస్తూ, అన్న మాట మీద ఉండాలని ఎద్దేవా చేస్తున్నారు. అయితే వీటిమీద బండ్ల గణేష్ స్పందిస్తూ నేనేదో కార్యకర్తలకి బలం అందించడం కోసమని ఆలా అంటే నిజంగానే మీరు నన్ను ఇలా ఇబ్బంది పెడతారా అని మాట్లాడాడు.

ఈ విషయాలన్నీ కూడా టీవీ లో చూసినటువంటి నా కొడుకు చాలా బయపడుతున్నాడు. “నాన్న, నువ్వు బ్లాడితో కోసుకొని చచ్చిపోతావా, నాకు భయంగా ఉంది, నువ్వు ఆలా చేయకు నాన్న అని ” రోజు వాడు నాదగ్గరికి వచ్చి ఏడ్చుకుంటూ, నాదగ్గరే పడుకుంటున్నాడు. దీంతో మీడియా తో పాటు అందరికీ దండం పెట్టేసి దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి నాకంటూ కుటుంబం ఉందని ప్రాధేయపడ్డాడు.Top