ఢిల్లీలో చంద్రబాబు, పవన్ ల పై అదిరిపోయే సెటైర్ వేసిన పృద్వి..!

By Xappie Desk, December 28, 2018 12:35 IST

ఢిల్లీలో చంద్రబాబు, పవన్ ల పై అదిరిపోయే సెటైర్ వేసిన పృద్వి..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడానికి ముందు నుండి పోరాడుతున్న ఏకైక పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రత్యేక హోదా అన్న నినాదం ప్రతి ఒక్కరి నోటిలో ఉందంటే దానికి కారణం వైసీపీ అధ్యక్షుడు జగన్ అని చెప్పటంలో ఎటువంటి సందేహం మొహమాటం అక్కర్లేదు. ప్రత్యేకహోదా అంశంపై రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు గాలికొదిలేసినప్పుడు ముఖ్యంగా అధికార పార్టీ టిడిపి ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ బెటర్ అని అన్న క్రమంలో కేవలం ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని రాష్ట్రంలో ఉన్న యువకులకు ఉద్యోగాలు వస్తాయని బలంగా నమ్మి రాష్ట్రంలో ప్రతి చోట యువభేరి లో నిర్వహించిన ఏకైక రాజకీయ నేత వైసీపీ అధినేత జగన్.

ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అంటూ ఇటీవల ఢిల్లీలో వంచన దీక్ష అంటూ వైసీపీ పార్టీ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న నటుడు వైసీపీ నాయకుడు పృథ్వి, చంద్రబాబుపై మరియు పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్ర‌త్యేక హోదా కోసం వైసీపీ మొద‌టినుంచి పోరాటం చేస్తుంటే… బాబు కుప్పిగంతులు వేస్తున్నార‌ని మండిప‌డ్డారు. మొద‌ట ప్యాకేజీకీ ఒప్పుకొని ఇప్పుడు ప్ర‌త్యేక‌హోదా అంటూ డ్రామాలాడుతున్నార‌ని ఎద్దేవ చేశారు.

తెలంగాణాలో పార్టీ మారిన నేత‌ల‌ను చిత్తుగా ఓడించండి అని చెప్పిన బాబు మ‌రి ఏపీలో కూడా అదే విధంగా చెప్తారాని ప్ర‌శ్నించారు. రాజకీయాల్లో నైతిక విలువలు లేని వ్యక్తి, మాటపై నిలకడలేని వ్యక్తి, అనైతిక పొత్తులకు ఆద్యుడు చంద్రబాబు నాయుడేనంటూ దుమ్మెత్తిపోశారు. మ‌రో వైపు ప‌వ‌న్‌ను కూడా టార్గెట్ చేసి విమ‌ర్శ‌లు గుప్పించారు. సంక్రాంతి పండుగకు హరిదాసుల్లా వచ్చిన వ్యక్తులు తమను ప్రశ్నిస్తున్నారంటూ మండిపడ్డారు. అసలు ప్రజల కోసం ముందు నుంచి పోరాటం చేస్తున్న వ్యక్తి ఎవరు అన్న విషయం ఏపీ ప్రజలకు క్లారిటీ ఉందని..కచ్చితంగా రాబోయేది రాజన్న రాజ్యం అని జగన్ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు పృద్వి.Top