పాదయాత్ర అయిన వెంటనే సంచలన నిర్ణయం తీసుకున్న జగన్..!

పాదయాత్ర అయిన వెంటనే సంచలన నిర్ణయం తీసుకున్న జగన్..!

ప్రజా సంకల్ప పాదయాత్ర త్వరలో పూర్తి కానున్న క్రమంలో వైసీపీ అధినేత జగన్ పూర్తిగా తన స్థిరనివాసాన్ని ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి మార్చడానికి రెడీ అయినట్లు పార్టీ వర్గాల నుండి వస్తున్న సమాచారం. ప్రస్తుతం లోటస్ పాండ్ లో జగన్ నివాసముంటున్నారు. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అన్ని విషయాలు హైదరాబాదులో ఉండే నివాసం నుండే చూసుకునేవారు జగన్ అదంతా గతంలో. అయితే పాదయాత్ర పూర్తి అయిన వెంటనే జగన్ తన మకాంను పూర్తిగా అమరావతికి మారుస్తుండటం వైసీపీ శ్రేణులకు నేతలకూ ఎంతగానో ఆనందం కలిగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపై వాళ్లు తమ అధినేతను కలిసేందుకు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండబోదు. జగన్ కూడా రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై పూర్తిగా దృష్టిసారించేందుకు అమరావతిలో ఆయన నివాసం దోహదపడనుంది. ఇప్పటికే రాజధాని పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్, బిజెపి, జనసేన పార్టీలు తమకంటూ సొంత కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ కూడా అమరావతికి తన పూర్తి మకాంని మారుతున్న క్రమంలో ఏపీ నూతన రాజధాని రాజకీయాలకు రసవత్తరమైన నిలయంగా మారింది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.Top