కేంద్రంపై చంద్రబాబు చేసిన కామెంట్లకు కంగుతిన్న ఏపీ బీజేపీ నేతలు..!

By Xappie Desk, December 29, 2018 13:12 IST

కేంద్రంపై చంద్రబాబు చేసిన కామెంట్లకు కంగుతిన్న ఏపీ బీజేపీ నేతలు..!

ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రంపై మాటల తూటాల వర్షం కురిపిస్తున్నారు. గత నాలుగు సంవత్సరాలు కేంద్రం తో చెట్టాపట్టాలు వేసుకుని పరిపాలన చేసిన టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికల వస్తున్న క్రమంలో ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించడం తో ఏపీ బీజేపీ నేతలు చంద్రబాబు చేస్తున్న కామెంట్లకు కంగుతింటున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల తాజాగా విశాఖ ఉత్సవ్ లో కేంద్రం ఎయిర్ షో ని నిరాకరించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఎపి దేశంలో ఒక భాగం కాదన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఎపి లో రుణమాఫీకి కేంద్రం సహకరించలేదని ఆయన అన్నారు.ఇప్పుడు ఓట్ల కోసం బిజెపి రైతులకు ఏదో చేస్తానని అంటోందని ఆయన విమర్శించారు.

కడప స్టీల్ ప్లాంట్ పై అనుకూల విషయాలను కేంద్రానికి వివరించామని ,అయినా పట్టించుకోలేదని ఆయన అన్నారు. ట్రిపుల్ తలాక్‌ విషయంలో అరెస్టులు సరికాదన్న సీఎం.. క్రిమినల్ కేసులు నమోదు చేసి మూడేళ్లు జైల్లో పెడతామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దేశంలో అందరికీ ఒకే ఐపీసీ వర్తించాలని, రాజ్యసభలో కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తామన్నారు.Top