టీఆర్ఎస్ ఎంపీల విందు కార్యక్రమంలో ఖమ్మం గురించి బాధపడిన కేసీఆర్..!

By Xappie Desk, December 29, 2018 13:20 IST

టీఆర్ఎస్ ఎంపీల విందు కార్యక్రమంలో ఖమ్మం గురించి బాధపడిన కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్రంలో రెండో సారి అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తర్వాత తన పార్టీ ఎంపీలతో పాల్గొన్న విందు కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మంత్రివర్గంలో మార్పులు ఖచ్చితంగా ఉంటాయని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదే క్రమంలో ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ చతికిల పడటంపై మెజార్టీ స్థానాలు రాకపోవడంపై కేసీఆర్ తీవ్ర సంతృప్తి చెందినట్లు పార్టీ నేతల్లో వినబడుతున్న టాక్.

ఈ నేపథ్యంలో కేసీఆర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలుస్తామని కొన్నాం కానీ ఆ జిల్లాలో ఉన్న పార్టీకి సంబంధించిన ఇద్దరు నేతలు ఒకరినొకరు ఓడించాలనుకున్నారు. వారిద్దరి మధ్య గొడవలెలా ఉన్నా... ప్రభుత్వ పనితీరును చూసైనా ప్రజలు గెలిపిస్తారని అనుకున్నాం. అది జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారని మీడియాలో కధనం. వంద సీట్లు వస్తాయని అనుకుంటే ఇలాంటి వాటి వల్ల నష్టం జరిగిందని ఆయన అన్నారు. కష్టపడి పనిచేసిన వారికి పదవులు వస్తాయి. మొక్కుబడిగా పనిచేస్తామంటే కుదరదు.

అధికారులు, సిబ్బంది అలసత్వాన్ని సహించేది లేదు. శాఖల వారిగా ప్రగతి కనిపించాలి. 64 ఏళ్ల వయసులో నేను ఎందుకు కష్టపడుతున్నాను? ఈ చలిలో ఎందుకు తిరుగుతున్నాను? తెలంగాణ అభివృద్ధితో పాటు దేశ ప్రగతిని కాంక్షిస్తూ పర్యటిస్తున్నానే తప్ప నాకేమీ స్వార్థం లేదు. అందరిలోనూ ఇలాంటి ఆలోచనలు రావాలి అని కెసిఆర్ అన్నారని సమాచారం వచ్చింది.Top