కేంద్ర ఎన్నికల కమిషన్ పై సంచలన కామెంట్స్ చేసిన టీపీసీసీ ఉత్తం కుమార్ రెడ్డి..!

By Xappie Desk, December 29, 2018 13:26 IST

కేంద్ర ఎన్నికల కమిషన్ పై సంచలన కామెంట్స్ చేసిన టీపీసీసీ ఉత్తం కుమార్ రెడ్డి..!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడిపోవడానికి గల కారణం ఈవీఎం లేనని తెలంగాణ ఫలితాలు వచ్చిన రోజు సంచలన కామెంట్లు చేశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ నేపథ్యంలో తాజాగా ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల విషయమై అప్పట్లో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన దాని గురించి ప్రస్తావించారు. ఫిర్యాదు చేసి చాలా రోజులు జరిగిన కేంద్ర ఎన్నికల సంఘం నుండి ఎటువంటి స్పందన రాలేదని బాధపడ్డారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంతేకాకుండా ఒక్క శాతం ఓట్ల తేడా ఉన్న నియోజకవర్గాలలో వివిపాట్ స్లిప్ లను లెక్కించాలని కోరినా అదికారులు పట్టించుకోలేదని ఆయన అన్నారు.

పొత్తుల వల్ల,చంద్రబాబుతో కలయిక వల్ల నష్టం జరగలేదని,అయితే పొత్తులు ఇంకా ముందు పెట్టుకోగలిగి ఉండాల్సిందని ఆయన అన్నారు.సీఎం ప్రమాణస్వీకారం చేసి రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకూ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయకపోవటం, అసెంబ్లీని సమావేశపరచకపోవటం దారుణమని ఆయన అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికలలో పొత్తులపై అదిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు వల్ల ఇంత దెబ్బ తగిలినా కానీ చంద్రబాబుపై మాట అనలేక పోతున్న కాంగ్రెస్ పార్టీ నేతల తీరు చూస్తుంటే కచ్చితంగా ఏపీలో కూడా పొత్తు కొనసాగుతున్నట్లు స్పష్టం అవుతుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.Top