నియంతలా వ్యవహరిస్తున్న చంద్రబాబు..?

By Xappie Desk, December 29, 2018 13:32 IST

నియంతలా వ్యవహరిస్తున్న చంద్రబాబు..?

టీడీపీ అధినేత చంద్రబాబు కి ఓటమి భయం పట్టుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఇచ్చిన షాక్ నుండి చంద్రబాబు ఇంకా పూర్తిగా బయటపడనట్లు అర్థమవుతోంది. ఇదే క్రమంలో ఏపీ లో జరుగుతున్న అన్ని సర్వేలలో వచ్చిన ఫలితాలు మొత్తం వైసీపీ పార్టీకి అనుకూలంగా రావడంతో చంద్రబాబు ఏపీ ప్రజల దగ్గర ఇష్టానుసారంగా నియంతగా మాట్లాడటం ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఇటీవల అనకాపల్లిలో జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ..‘‘ఇన్ని చేసిన నేను కూడా మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుక్కోవాలా? నన్ను మళ్లీ గెలిపించుకోవల్సిన బాధ్యత మీపై లేదా?’’ అని అన్నారట. ఏ ముఖ్యమంత్రి చేయనంతగా తాను చేశానని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించానని చెప్పారట. తాను చేసిన మేలులను ప్రజలు మర్చిపోతున్నారని.. ప్రతిపక్ష పార్టీల ఉచ్చులో పడిపోతున్నారని వ్యాఖ్యానించారు. తనను మళ్లీ గెలిపించుకోకపోతే అభివృద్ధి అంతా ఆగిపోతుందని, ఆ తర్వాత రాష్ట్ర ప్రజలే నష్టపోతారని అసహనం వ్యక్తం చేశారు.

తన వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ టీడీపీ కార్యకర్తలుగా మారాలని హుకుం జారీ చేశారు. చంద్రబాబునాయుడు ఆర్మీలో కానీ.. టీడీపీలోగానీ చేరాలని, తమ ప్రభుత్వం గెలుపుకోసం పని చేయాలని ఆయన అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు విన్న కొంతమంది విపక్ష పార్టీకి చెందిన నాయకులు చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని కామెంట్లు చేస్తున్నారు.Top