జగన్ ని కలిసిన పవన్ కళ్యాణ్ స్నేహితుడు..!

By Xappie Desk, December 29, 2018 13:41 IST

జగన్ ని కలిసిన పవన్ కళ్యాణ్ స్నేహితుడు..!

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర కి రోజు రోజుకి సినీ ఇండస్ట్రీ నుండి ఊహించని విధంగా మద్దతు రావడం విశేషం. ఈ నేపథ్యంలో ఇటీవల వైసీపీ అధినేత జగన్ ని పవన్ కళ్యాణ్ స్నేహితుడు సినీ నటుడు కమెడియన్ ఆలీ కలిశారు దాదాపు ఇద్దరి మధ్య గంట సేపు చర్చలు జరగడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సందర్భంగా కమెడియన్ ఆలీ జగన్ చేస్తున్న పాదయాత్ర పై ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రజల కోసం ఇంతగా కష్టపడే వ్యక్తి ఈ రోజుల్లో రాజకీయాల్లో ఉండటం ప్రజలు చేసుకున్న పుణ్యం అని ఆలి అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో ప్రజలు జగన్ ని ఆదరించడం పట్ల కూడా ఎంతగానో సంతోషించినట్లు సమాచారం. అంతేకాకుండా ఆలీ జగన్ ఆరోగ్య సమస్యలు, విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడిపై కూడా చర్చించుకున్నారు. పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆలీ సూచించారు.

ఈ సందర్భంగా జగన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారని ప్రచారం. ఇకపోతే వైఎస్ జగన్ కు సినీ రంగం నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోంది. వారం రోజుల క్రితం సినీనటుడు భానుచందర్, కృష్ణుడులు వైఎస్ జగన్ ను పాదయాత్రలో కలిశారు. ఇరువురు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన వంచనపై గర్జన దీక్షలో సైతం కృష్ణుడు పాల్గొన్నారు.Top