సాక్షి ఆఫీస్ ఎదుట ధర్నా చేసిన పరిటాల శ్రీరామ్..!

By Xappie Desk, December 29, 2018 16:31 IST

సాక్షి ఆఫీస్ ఎదుట ధర్నా చేసిన పరిటాల శ్రీరామ్..!

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో రాజకీయ ముఖచిత్రం ఫ్యాక్షన్ రాజకీయాలను తలపిస్తుంది. జనరల్ గా రాజకీయాలలో పరిటాల కుటుంబానికి మరియు వైఎస్ కుటుంబానికి వైరం ఉన్నట్లు చాలా మంది కామెంట్లు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న పరిటాల రవి తనయుడు పరిటాల శ్రీరామ్ అనంతపురం జిల్లాలో సాక్షి ప్రాంతీయ కార్యాలయం ఎదురుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ధర్నాకు దిగారు. అంతేకాకుండా సాక్షికి వ్యతిరేకంగా పరిటాల వర్గీయులు అక్కసును వెళ్లగక్కారు.

దీనిపై రాఫ్తాడు వైసీపీ నియోజకవర్గ ఇంచార్జీ తో పుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వాస్తవాలను బయటపెడుతున్నందనే ఉద్దేశ్యంతోనే పరిటాల వర్గీయులు ధర్నాలు చేస్తున్నారని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. పరిటాల కుటుంబం చేస్తున్న అరాచకాలను ఎండగడుతున్నందుకే సాక్షిపై పరిటాల కుటుంబం ఆరోపణలు చేస్తోందని ఆయన విమర్శించారు. మొత్తం మీద ఒక్కసారిగా సాక్షి పత్రిక కార్యాలయం ఎదుట పరిటాల శ్రీరామ్ ధర్నాకు దిగడంతో రాష్ట్రంలో ఈ టాపిక్ పెద్ద హాట్ టాపిక్ అయింది.Top