ఎన్టీఆర్ బయోపిక్ పై సంచలన కామెంట్స్ చేసిన నాదెండ్ల భాస్కర్ రావు..!

ఎన్టీఆర్ బయోపిక్ పై సంచలన కామెంట్స్ చేసిన నాదెండ్ల భాస్కర్ రావు..!

నందమూరి బాలకృష్ణ తన తండ్రి దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఎన్నికల వస్తున్న క్రమంలో ముందే ఈ సినిమాని విడుదల చేయాలని బాలకృష్ణ శరవేగంగా షూటింగ్ ని పూర్తి చేసేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు నాదెండ్ల భాస్కర్ రావు. సినిమాలో ఏమాత్రం తన పాత్ర నెగిటివ్ షేడ్ లో కించపరిచే విధంగా ఉంటే సినిమా యూనిట్ మొత్తం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని హెచ్చరించారు.

అంతేకాకుండా ఇప్పటికే సినిమా యూనిట్ కు రెండు దఫాలు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. తనను నెగిటివ్ గా చూపించే ప్రయత్నం చేయడం సహజమని చెప్పారు. సినిమాలో ఎవరినో ఒకరిని అలా చూపడం సహజమని ఆయన చెప్పారు. సినిమాలో తన క్యారెక్టర్ విషయమై నెగిటివ్ గా చూపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఈ విషయమై తన పెద్ద కొడుకు రెండు దఫాలు నోటీసులు ఇచ్చినట్టు నాదెండ్ల భాస్కర్ రావు చెప్పారు. మరోపక్క ఈ సినిమా జనవరిలో విడుదల కాబోతున్న క్రమంలో అటు సినిమా ఇండస్ట్రీ ఇటు రాజకీయ రంగం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తుంది.Top