కొత్త సంవత్సరంలో కేసీఆర్ సరికొత్త నిర్ణయాలు..!

By Xappie Desk, December 31, 2018 16:49 IST

కొత్త సంవత్సరంలో కేసీఆర్ సరికొత్త నిర్ణయాలు..!

ముందస్తు ఎన్నికలకు వెళ్లి గెలిచి చరిత్ర సృష్టించిన టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటికే అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో 2019 సంవత్సరంలో ఇంకా అనేక సంచలనాలు సృష్టించడానికి కెసిఆర్ నాంది పలుకుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 2019 నూతన సంవత్సర మొదటి రోజున టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇరిగేషన్‌ ప్రాజెక్టులను సందర్శించాలని నిర్ణయించారు. అందులో భాగంగా 1వ తేదీన కాళేశ్వరం, 2వ తేదీన శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లోగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.

ఈ మేరకు ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించనున్నట్లు గత సమీక్షలోనే సీఎం ప్రకటించారు. 18, 19 తేదీల్లో తుఫాను కారణంగా ఆ పర్యటన వాయిదా పడింది. తాజాగా, జనవరి 1వ తేదీన ప్రాజెక్టును పరిశీలించాలని సిఎం నిర్ణయించారు.. ఇదే క్రమంలో రాష్ట్రంలో ఉన్న నేటి పారుదల మరియు వైద్య ఆరోగ్య శాఖల పై అనేక కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు టిఆర్ఎస్ పార్టీ నుండి వస్తున్న సమాచారం. ముఖ్యంగా ఇటీవల రాష్ట్రానికి సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కేసీఆర్.. నీటి పారుదల రంగానికి ప్రస్తుతం ఇస్తున్న ప్రాముఖ్యతను కొనసాగిస్తూనే విద్య, వైద్య రంగాలకు ఈ దఫా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సిఎం కెసిఆర్‌ స్పష్టం చేశారు.

కంటి వెలుగు శిబిరాలు నిర్వహించిన విధంగానే చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు నిర్వహించాలని సిఎం కెసిఆర్‌ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరిలో చెవి, ముక్కు, గొంతు, దంత వైద్య శిబిరాలకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ ను రూపొందించాలని ఆదేశించారు.Top