కొత్త సంవత్సర వేడుకలకు హోటల్ లకు షాక్ ఇచ్చిన సిటీ సివిల్ కోర్టు..!

By Xappie Desk, December 31, 2018 16:56 IST

కొత్త సంవత్సర వేడుకలకు హోటల్ లకు షాక్ ఇచ్చిన సిటీ సివిల్ కోర్టు..!

మరి కొద్ది గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న క్రమంలో నగరంలో ఉన్న పలు స్టార్ హోటల్ లు, పబ్‌లు, కేఫేలు, రిసార్ట్‌లు, బార్‌ లు ఆటపాటలతో ప్రజలను మురిపించడానికి మరియు మైమరిపించడానికి రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిటి సివిల్‌ కోర్టు నోటీసులు జారీ చేసింది. కాపీ రైట్‌ చట్టాన్ని ఉల్లంఘిస్తూ వాటికి సంబంధించిన సంస్థల నుంచి అనుమతులు తీసుకోకుండా బాలీవుడ్‌ పాటలను వివిధ రూపాల్లో ప్రదర్శించనున్నట్లు ఆయా హోటళ్లు భారీగా ప్రచారం కల్పించాయి.

నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఉన్న 79 హోటళ్ల ప్రచార పత్రాలను, హోర్డింగ్‌ల ద్వారా ప్రచారం కల్పించిన ఆధారాలను, టిక్కెట్‌లపై ముద్రించిన వాటితో పాటు వారి హోటల్‌ సైట్‌లలో ఉన్న అడ్వర్టయిజ్‌లపై సిటి సివిల్‌ కోర్టులో పేటెంట్‌ కలిగి ఉన్న సంస్థ నోవెక్స్‌ కమ్యూనికేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సవాల్‌ చేసింది. లక్షకు పైగా పాటలకు తాము పేటెంట్‌ కలిగి ఉన్నామని.. ఆయా పాటలను బహిరంగంగా ప్రదర్శించే ముందు తప్పని సరిగా తమ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ముంబైకి చెందిన ఆ సంస్థ ప్రతినిధి విక్కీ మదన్‌ డిసెంబర్‌ 28న సిటి సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.Top