జాతీయ స్థాయిలో రాణించడానికి జగన్ హెల్ప్ తీసుకుంటున్న కేసీఆర్..?

By Xappie Desk, December 31, 2018 17:17 IST

జాతీయ స్థాయిలో రాణించడానికి జగన్ హెల్ప్ తీసుకుంటున్న కేసీఆర్..?

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అధినేత జగన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. తాజాగా ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై మద్దతు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్రలో శ్రీకాకుళం జిల్లాలో పలాస నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో కెసిఆర్ గురించి జగన్ మాట్లాడుతూ...కెసిఆర్ స్పెషల్ స్టేటస్ కు మద్దతు ఇస్తే చంద్రబాబు దాన్ని పొలిటికల్ మైలేజీ కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి స్పందించి ఏపీకి హోదా కోసం కేంద్రానికి లేఖ రాస్తానని చెప్తే ఎవరైనా ఆనందించి స్వాగతిస్తారని జగన్ అన్నారు.

కేసీఆర్‌ మద్దతుతో మొత్తం 42 మంది ఎంపీలవుతారని, బలం దొరుకుతుందని ఆయన అన్నారు. అయితే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని జగన్ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా పలాస బహిరంగ సభలో ప్రసంగించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఇన్నేళ్లు పట్టించుకోని కడప ఉక్కు పరిశ్రమకు ఆగమేఘల మీద శంకుస్థాపనలు చేశారని, చుక్కనీరు కూడా పోలవరం ప్రాజెక్టులో లేకపోయినా గేట్లు బిగింపు పేరుతో హంగామా చేస్తున్నారని విమర్శించారు. ఇదే క్రమంలో త్వరలో జాతీయ రాజకీయాల్లో రాణించాలని చూస్తున్న కెసిఆర్.. ప్రస్తుతం ఏపీ లో అన్ని సర్వేలు జగన్ పార్టీకి అనుకూలంగా ఉన్న క్రమంలో ఏపీ కి స్పెషల్ స్టేటస్ ఇచ్చే క్రమంలో తన పార్టీ కూడా మద్దతు తెలిపితే జాతీయ స్థాయిలో కొంత సులువుగా రాణించవచ్చని కెసిఆర్ అద్భుతమైన ప్లాన్ వేశారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.Top