కేసీఆర్ గిఫ్ట్ ఇస్తే తిరిగి నా గిఫ్ట్ కూడా ఉంటుంది. బాబు సంచలన వ్యాఖ్యలు..!

By Xappie Desk, December 31, 2018 17:34 IST

కేసీఆర్ గిఫ్ట్ ఇస్తే తిరిగి నా గిఫ్ట్ కూడా ఉంటుంది. బాబు సంచలన వ్యాఖ్యలు..!

ఇటీవల చంద్రబాబు కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కెసిఆర్ చేసిన కామెంట్లకు ఏపీ సీఎం చంద్రబాబు తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. కెసిఆర్ ఏ విధంగా గిఫ్ట్ ఇస్తారు అదేవిధంగా మరింత వేగంతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చాటింగ్ కామెంట్లు చేశారు చంద్రబాబు. ఇటీవల అమరావతి లో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు..కేసీఆర్ గిఫ్ట్ ఇస్తే తీసుకోవడానికి సంతోషంగానే ఉందన్నారు. మరి అదేవిధంగా నవ్వుతూ నా గిఫ్ట్ కూడా కెసిఆర్ కి ఉంటుందని హెచ్చరించారు. ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ ఏపీలో వైసీపీకి మద్దతిస్తామని చెప్పొచ్చు కదా అంటూ బాబు కేసీఆర్‌పై విమర్శించారు.

ఏపీలో వైసీపీతో కలిసి పనిచేస్తామని చెప్పమనండి బాధ లేదన్నారు. ఫెడరల్ ఫ్రంట్ లో కలిసి పనిచేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. డొంక తిరుగుడు, రిటర్న్ గిఫ్ట్‌లు ఏంటండి నేరుగా సమాధానం చెప్పాలని బాబు కేసీఆర్ ను కోరారు. ఇప్పటికే వైసీపీ నేతలకు తెలంగాణలో కాంట్రాక్టులు ఇచ్చారని... ఇంకా కాంట్రాక్టులు ఇస్తారేమోనని బాబు అభిప్రాయపడ్డారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ కి డబ్బులు ఇచ్చి మద్దతు తెలుపుతారు ఏమో అని చంద్రబాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కామెంట్లు చేసిన భయపడేది లేదని ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుడు ఎక్కడైనా ప్రచారం చేయొచ్చని ఈ ఉద్దేశంతోనే తెలంగాణ ప్రజలకు మేలు జరగాలని ఆ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అని స్పష్టం చేశారు చంద్రబాబు.Top