చంద్రబాబు కి సడన్ షాక్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే...!

By Xappie Desk, December 31, 2018 17:43 IST

చంద్రబాబు కి సడన్ షాక్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే...!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. ముఖ్యంగా వైసిపి ఫ్యాన్ గాలికి ఏ రాజకీయ పార్టీలు జగన్ పై ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని ఆదరణను ఆపలేకపోతున్నాయి. దీంతో ఏపీ లో జరుగుతున్న అన్ని సర్వేలలో వైసీపీ పార్టీ గెలుస్తుందని ఫలితాలు రావడంతో తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఓటమి భయం స్టార్ట్ అయింది. ఇదే క్రమంలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో చాలామంది తమ రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీ పార్టీ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తనతో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.

గతంలో వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన గుర్నాథ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఏపీలో టిడిపి పై ప్రజా వ్యతిరేకత ఎక్కువ కనబడుతున్న క్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం టీడీపీలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మరియు గురునాథ రెడ్డి ల మధ్య ఎక్కువ వివాదాలు నెలకొంటున్న క్రమంలో రాజీనామా చేయడంలో ఒక కారణం కూడా అని అంటున్నారు అనంతపురం రాజకీయ నేతలు. అయితే త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తు నిర్ణయం గురించి ప్రకటిస్తానని తెలిపారు గుర్నాథ్ రెడ్డి.Top