ఏపీ బీజేపీ కి కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్న ఆ పార్టీ ఎమ్మెల్యే..?

By Xappie Desk, December 31, 2018 17:52 IST

ఏపీ బీజేపీ కి కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్న ఆ పార్టీ ఎమ్మెల్యే..?

ఏపీ బిజెపి లో కీలకంగా అన్ని బాధ్యతలు చూసే విశాఖపట్టణం నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెగ వార్తలు వినబడుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మరియు బిజెపి పార్టీల మధ్య తీవ్ర అగాధం నెలకొన్న క్రమంలో ఒత్తిడికి విష్ణుకుమార్ రాజు గురవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాలకు గత మూడు నెలల నుండి విష్ణుకుమార్ రాజు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. మరోపక్క ప్రభుత్వ కార్యక్రమాలకు సభలకు సమావేశాలకు మాత్రం హాజరవుతున్నారు.

దీంతో త్వరలో ఎన్నికలు రానున్న క్రమంలో రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే అనుమానం భయం విష్ణుకుమార్ రాజు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. దీంతో విష్ణుకుమార్ రాజు 15 ప్రశ్నలతో ప్రజానాడిని తెలుసుకోవడానికి ఆయన మిత్రబృందం నియోజకవర్గంలో సర్వే చేయించినట్లు సమాచారం.

ఫలితం ఆయనకు అనుకూలంగా వచ్చినట్లు చెబుతున్నారు. దాంతో తిరిగి పోటీ చేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు సమాచారం. అయితే, ఎక్కువ మంది ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీడిపికి ఓటు వేస్తామని సర్వేలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎన్నికల ముందు బిజెపి పార్టీకి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు రాజీనామా చేస్తే కచ్చితంగా బీజేపీ కి కోలుకోలేని దెబ్బ తగులుతుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.Top