వేలాది మంది అమరావతి కి !

By Xappie Desk, January 01, 2019 22:28 IST

వేలాది మంది అమరావతి కి !

అమరావతికి కొద్ది రోజులుగా పదుల సంఖ్యలో బస్సులు వస్తున్నాయి. అత్యాధునికంగా నిర్మించిన రోడ్ల మీద పరుగులు పెడుతున్నాయి. వేల మంది వస్తున్నారు. ఎందుకొస్తున్నారు..? అమరావతిలో ఏముంది..? ఇటుకలు వేయలేదని.. ప్రతిపక్షం చెబుతోంది. ఏమీ జరగడం లేదని.. అంతా గ్రాఫిక్సేనని గిట్టని వాళ్లు చెబుతున్నారు. కానీ.. ఎందుకొస్తున్నారు. ప్రభుత్వం.. అమరావతిపై అవగాహన కల్పించేందుకు సందర్శకలకు అవకాశం ఇస్తోంది. పలు జిల్లాల నుంచి అమరావతిని చూసేందుకు తరలి వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా , కర్నూలు జిల్లా , అనంతపురం జిల్లా , చిత్తూరు జిల్లా, కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా , ప్రకాశం జిల్లా కురిచేడు, ఒంగోలు అర్బన్‌, రూరల్‌, తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలాలకు చెందిన ప్రజలు, విద్యార్థులు వందల సంఖ్యలో వచ్చారు. శంకుస్థాపన జరిపిన ఉద్ధండరాయునిపాలెంలోని ప్రదేశం నుంచి వారి యాత్ర ప్రారంభమవుతోంది. అక్కడ సీఆర్డీయే అధునాతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ వారిని ఆకట్టుకుంది.

అక్కడి అధికారులు వారికి రాజధానికి సంబంధించిన వివరాలను, అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్‌ టవర్లు ఇత్యాది వాటికి చెందిన విశేషాలను తెలియజెప్పారు. అనంతరం అమరావతిలోని తూర్పు- పశ్చిమ కొసలను కలిపే సీడ్‌ యాక్సెస్‌ రహదారితోపాటు ఇతర ప్రధాన రహదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీస్‌ అధికారులు (ఏఐఎస్‌), గెజిటెడ్‌ అఽధికారులు, ఎన్జీవోలు, గ్రూప్‌-డి ఉద్యోగుల కోసం గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో నిర్మితమవుతున్న భారీ టవర్లను సందర్శకులు పరిశీలించారు. రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక నిర్వహణకు వీలుగా తుది మెరుగులు దిద్దుకుంటున్న జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌, సెక్రటేరియట్‌- హెచ్‌వోడీ కార్యాలయాల కోసం నిర్మిస్తున్న టవర్లలో ఒకదానికి జరుగుతున్న ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులను ఆసక్తిగా తిలకించారు.

వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి కూడా వెళ్లి, అందులోని పచ్చదనంతోపాటు అధికారులు, ఉద్యోగుల ఛాంబర్లను చూశారు. మొత్తం 16 ప్రత్యేక బస్సుల్లో రాష్ట్రంలోని నలుమూలల నుంచి తరలి వచ్చిన సందర్శకుల సౌకర్యార్ధం ఉద్ధం డరాయునిపాలెం వద్ద సీఆర్డీయే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌లో మధ్యాహ్న భోజనాలు, ఇతర వసతులు కల్పించారు. కాగా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో కాకుండా విజయవాడ, గుంటూరు, అమరావతి పరిసరాల్లోని పలు ప్రదేశాల నుంచి కూడా పలువురు తమకు తాముగా రాజధాని సందర్శనకు విచ్చేశారు. వీరిలో రైతులు, ఉద్యోగులు, వ్యాపారులే కాకుండా పెద్దసంఖ్యలో మహిళలు, యువ తీయువకులు ఉన్నారు.Top