ఏపీ కి రావాలంటే భయపడుతున్న మోడీ !

ఏపీ కి రావాలంటే భయపడుతున్న మోడీ !

ఏపీకి రావడానికి నరేంద్రమోడీకి ధైర్యం చాలడం లేదు. నిరసనలు ఎదురొచ్చి పరువు తీస్తాయని ఆయన భయపడ్డారు. ఆయినా సరే ఆయన ఏపీలో చొరబడటానికి ప్రయత్నాలు మాత్రం ఆగడంలేదు. ఆయన తనదైన యాప్‌తో.. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి సందేశం అందించడానికి.. ఏర్పాట్లు చేసుకున్నారు. రెండో తేదీన, ఆరో తేదీన ఆయన తన “నమో యాప్‌”లో ఏపీ కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే.. ఏపీ కార్యకర్తలకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పేర్లు నమోదు చేసుకుంటున్నారు. రెండు సార్లు ఆయన ఏపీపై ఎటాక్ చేయబోతున్నారు.

మాట్లాడబోయేది ఏపీ కార్యకర్తలతో కాబట్టి.. కచ్చితంగా.. ఏపీ గురించే మాట్లాడతారు మోడీ. అందులో సందేహం లేదు. ఓ రకంగా.. తాను ఏపీకి వచ్చి బహిరంగసభల్లో ప్రసంగించాల్సిన మ్యాటర్‌ను అక్కడ వినిపించే అవకాశం ఉంది. నిరసనల్లాంటి అవకాశాలు లేవు కాబట్టి.. వన్ సైడ్‌గా తాను చెప్పాలనుకున్నది చెబుతారు. ఏం చెబుతారన్నదే ఆసక్తి కరం. విభజన హామీల గురించి చెబుతారా..? ఏపీలో అవినీతి జరుగుతోందని చెబుతారా..? లేక పోతే.. ఎన్టీఆర్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పెట్టిన పార్టీ అయినప్పటికీ.. ఇప్పుడు టీడీపీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుందని చెబుతారా..? అన్నదే ఆసక్తికరం. ఏం చెప్పినా బీజేపీ కార్యకర్తలతోనే…! ఏ మ్యాటర్ అయినా.. అది.. ముందుగానే స్క్రిప్టింగ్ కాబట్టి.. చెప్పాలనుకున్నదే చెబుతారు. చంద్రబాబును విమర్శించినట్లుగా..మాట్లాడి ఏపీపై విషం కక్కుతారు.

ఇప్పుడు నరేంద్రమోడీతో నమో యాప్‌ద్వారా మాట్లాడాలంటే.. బీజేపీకి చెందిన చోటా నేత అయి.. రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన సరిపోదు. ఏం మాట్లాడాలి.. ఎలా మాట్లాడాలన్నదానిపై.. ఇన్ స్ట్రక్షన్స్‌ను కచ్చితంగా ఫాలో కావాలి. ఎందుకంటే.. తమిళనాడులో.. ఓ బీజేపీ నేత.. నేరుగా మోదీపైనే విరుచుకుపడ్డారు. నాలుగున్నరేళ్లలో మధ్యతరగతి ఏం చేశారో .. సూటిగా, సుత్తి లేకుండా చెప్పాలని ప్రశ్నించడంతో.. మోడీ నీళ్లు నమలాల్సి వచ్చింది. ఆ వీడియో… హైలెట్ అవడంతో.. చివరికి రాహుల్ గాంధీ కూడా ఎగతాళి చేశారు. పోయిన పరువు రాదు కాబట్టి.. మళ్లీ పరువు పోకూడదని డిసైడ్ అయ్యారు.



Top