కర్నూలు కి చంద్రబాబు వరం !

By Xappie Desk, January 01, 2019 22:37 IST

కర్నూలు కి చంద్రబాబు వరం !

కరువు సీమ రాయలసీమని రతనాల సీమగా మార్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విపరీతంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే విభజనతో తీవ్రంగా నష్టపోయిన సీమ ప్రాంతాన్ని అన్ని ప్రాంతాలకంటే ముందుండేలా, కరువుకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథాన నిలిపేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారు.

చిత్తూరును ఎలక్ట్రానిక్‌ హబ్‌గా మార్చిన చంద్రబాబు, అనంతపురంకు కియా కార్ల ఫ్యాక్టరీని బహుమతిగా ఇచ్చారు. ఇటు కడపలో ఉక్కు ఫ్యాక్టరీని స్థాపించి ఆ జిల్లా వాసుల ఉపాధికి ఢోకాలేకుండా వారి జీవనోపాధిని మెరుగుపరిచే యత్నం చేస్తున్నారు.. అయితే, రాయలసీమలో మరో జిల్లా అయిన కర్నూలు మీద ఫోకస్‌ పెడుతున్నారు చంద్రబాబు.. ఆ ప్రాంతంలో పలు సిమెంట్‌ ఫ్యాక్టరీలకు అనుమతి ఇచ్చారు. అంతేకాదు, ప్రపంచానికే ఏపీని విత్తనభాండాగారంగా, సీడ్‌ సెంటర్‌గా మార్చడానికి మైక్రోసాఫ్ట్‌ సంస్థ అధినేత బిల్‌ గేట్స్‌తోపాటు పలు అంతర్జాతీయ వ్యవసాయ విద్యాలయాలతో ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు చంద్రబాబు.. దీంతో, కర్నూలు కూడా త్వరలోనే మిగిలిన సీమ జిల్లాలతో పోటీ పడుతూ పరుగులు పెట్టనుంది..

వీటన్నింటికి తోడు, తాజాగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో విమానాశ్రయం రెడీ అయింది.. తాజాగా హైదరాబాద్‌ బేగంపేట నుండి ట్రయల్‌ రన్‌ చేయగా అది సక్సెస్‌ అయింది.. జనవరి 7వ తేదీన ఈ విమానాశ్రయం రాయలసీమలో ఏర్పాటు కానుంది.. రాయలసీమలో ఇది నాలుగవ ఎయిర్‌పోర్ట్‌ అవుతుంది.. కర్నూలులో సున్నపురాయి నిల్వలు ఎక్కువగా ఉండడంతో పారిశ్రామిక వేత్తలు పరుగులు పెడుతున్నారు. ఇటు, సీడ్‌ సెంటర్‌గా ఓర్వకల్లులో యూనివర్శిటీ సైతం రూపుదిద్దుకుంటోంది.. దీంతో అక్కడికి రవాణా సౌకర్యాలు మెరుగుపడడం కోసం చంద్రబాబు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.. అది విజయవంతం అయింది.. దీంతో అక్కడ అభివృద్ది వేగం పుంజుకోనుంది..Top