టీడీపీ సెల్ఫ్ గోల్ !

By Xappie Desk, January 01, 2019 22:40 IST

టీడీపీ సెల్ఫ్ గోల్ !

ఒకవైపు కేసీఆర్ చంద్రబాబు మీద చేసిన వ్యాఖ్యలు వెబ్ లో వైరల్ గా కొనసాగుతూ ఉన్నాయి. కేసీఆర్ ప్రసంగ పాఠం బిట్లు బిట్లుగా.. వెబ్ లో వైరల్ గా మారింది. ఒకటా రెండా.. చంద్రబాబు మీద కేసీఆర్ చాలా పంచ్ లే వేశాడు. చంద్రబాబు నువ్వొక దద్దమ్మ, నీకు తెలివి లేదు, పాలన చేత కాదు.. అందుకే అందరి మీదా పడి ఎప్పుడు ఏడుస్తుంటావు అని కేసీఆర్ ధ్వజమెత్తాడు.

ఇక చంద్రబాబు నాయుడి నైతికత మీద కూడా కేసీఆర్ చాలా వ్యాఖ్యానాలు చేశాడు. బాబు అనైతిక మాటలన్నింటికీ గురించి కూడా కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యానాలు చేశాడు. చంద్రబాబు నాయుడి ద్వంద్వ వైఖరి గురించి, అనైతిక మాటల గురించి విరుచుకుపడ్డాడు కేసీఆర్.

ఇలా అన్ని రకాలుగా కేసీఆర్ పంచ్ లు విసిరితే.. చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్లు మాత్రం ఏదేదో మాట్లాడారు. కేసీఆర్ కు సమాధానాలు ఇవ్వడానికి అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్లు చాలా మంది ప్రెస్ మీట్లు అయితే పెట్టారు కానీ.. ఎవరూ ధాటిగా మాట్లాడలేకపోయారు.

కేసీఆర్ గురించి వీళ్లు అనుచితంగా అయితే మాట్లాడారు. తిట్టారు. దుర్భాషలు ఆడమంటూనే అలా మాట్లాడారు. అయితే.. కేసీఆర్ ప్రస్తావించిన పాయింట్లకు మాత్రం వీరు సమాధానాలు ఇవ్వలేకపోయారు. కేసీఆర్ చంద్రబాబు నాయుడి అనైతికత గురించి మాట్లాడితే.. టీడీపీ మాత్రం అలాంటి అంశాలను ప్రస్తావించలేకపోయారు. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు తీరును వీరు సమర్థించలేకపోయారు.

ఇక చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నుంచి తను పార్టీని లాక్కొనేటప్పటికీ కేసీఆర్ తనతోనే ఉన్నాడని బాబు చెప్పుకొచ్చాడు. అంటే తను ఎన్టీఆర్ నుంచి పదవి లాక్కొన్నట్టుగా చెప్పుకున్నట్టేTop