కాంగ్రెస్ కి కోదండరాం షాక్ !

By Xappie Desk, January 01, 2019 22:45 IST

కాంగ్రెస్ కి కోదండరాం షాక్ !

తెలంగాణ ఎన్నికల్లో ఓటమితో కుమిలిపోతున్న కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేలా టీజేఎస్ అధినేత ప్రొ.కోదండరాం పలు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రచారం విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా ఆలస్యం చేసిందని, ప్రచారానికి 15 రోజులు చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారని పేర్కొన్నారు.

కేసీఆర్ ప్రచారశైలి వారికి తెలియదని చెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదన్నారు. ఎన్నికల ప్రక్రియలో గందరగోళానికి అధికారుల తప్పిదం కూడా కారణం అయి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈవీఎంలే కారణమనడం సరికాదన్నారు. త్వరలోనే కూటమి సమావేశం జరిపి పార్లమెంట్ ఎన్నికలపై చర్చిస్తామని తెలిపారు. ఇక ఫెడరల్ ఫ్రంట్ అనేది సాధ్యమయ్యే పని కాదని ఆయన స్పష్టం చేశారు. మూడో కూటమి కట్టడానికి కొన్ని ప్రాతిపాదికలు ఉండాలని పేర్కొన్నారు. కేసీఆర్, చంద్రబాబు మధ్య ఎటువంటి సంబంధాలు ఉన్నాయో… చంద్రబాబుకు కేసీఆర్ ఎటువంటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో చూడాలన్నారు.Top