హ్యాపీగా లేని కెసిఆర్ !

By Xappie Desk, January 01, 2019 22:46 IST

హ్యాపీగా లేని కెసిఆర్ !

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల యాత్రకు బయలుదేరారు. ఇవాళటి నుంచి ఆయన మూడు రోజుల పాటు తెలంగాణలోని నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సందర్శించనున్నారు. నీటి పారుదల శాఖ నిపుణులు, అధికారులతో కలిసి ఆయన ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. అయితే, పనులపై ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు.

వేగంగా పనులు జరిపించాలని ఆదేశాలిచ్చారు. ఇవాళ కరీంనగర్ లోనే బస చేయనున్న ఆయన రేపు, ఎల్లుండి పాలమూరు – రంగారెడ్డి, డిండి, సీతారామ ప్రాజెక్టులను సందర్శించనున్నారు. తర్వాత ఆయన ఈ ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.Top