పవన్ కళ్యాణ్ ని వెంటాడుతున్న పిఆర్ పి చేదు అనుభవాలు..!

By Xappie Desk, January 02, 2019 10:31 IST

పవన్ కళ్యాణ్ ని వెంటాడుతున్న పిఆర్ పి చేదు అనుభవాలు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో మిగిల్చిన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటున్నట్లు ప్రస్తుతం జనసేన పార్టీ నుండి వినబడుతున్న సమాచారం. గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ విషయంలో అనేక ఎత్తుపల్లాలు చూసిన పవన్ కళ్యాణ్ అటువంటి సంఘటనలు తన పార్టీలో జరగకుండా ఉండాలని ముందు నుండి జాగ్రత్త తీసుకుంటున్నారు. అయితే ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న క్రమంలో పిఆర్ పి పార్టి లాగే జనసేన పార్టీ కూడా అవుతుందేమోనని భయపడుతున్నారట. గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఉన్న నాయకులు పార్టీ స్థాపించిన చిరంజీవితో కలిసి పనిచేసి తరువాత చిరంజీవి మీదనే తిరగబడినవారు ఉన్నారు. అంతే కాకుండా ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు గంటా శ్రీనివాసరావు కూడా ఎలాంటి పాత్ర పోషించారో అందరికి తెలుసు. ఇప్పుడు ఇలాంటి అంశాలే పవన్ ను భయపెడుతున్నాయట. తన పార్టీలో ఉండేటువంటి నేతల్లో పవన్ ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా చాలా సరళంగా సామరస్యంగా పనులు చక్కబెడుతున్నారని, వారితో ఏ మాత్రం అశ్రద్ధగా వ్యవహరించినా వారు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరి ప్రజారాజ్యం పార్టీ మాదిరిగానే “జనసేన” పార్టీని దెబ్బ కొట్టేలా చేయొచ్చేమో అని పవన్ ఇంకా భయపడుతున్నారని వారి సన్నిహితుల నుంచే అందుతున్న సమాచారం. స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలనుకుంటున్నా పవన్ రాబోయే రోజుల్లో ఎలా రాణిస్తారో చూడాలి.Top