చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన మోడీ..!

By Xappie Desk, January 02, 2019 10:36 IST

చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన మోడీ..!

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి మహా కూటమిని ఏర్పాటు చేసిన చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బిజెపి పార్టీ నాయకుడు భారత్ ప్రధాని నరేంద్ర మోడీ. జాతీయస్థాయిలో ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న మహా కూటమి మరియు ఫెడరల్ ఫ్రంట్ పై తనదైన శైలిలో కౌంటర్లు వేసారు మోడీ. దేశంలో నన్ను ఒంటరిని చేయడానికి అందరూ ఏకమవుతున్నారు రాబోయే ఎన్నికల్లో వారు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిట్టు కొడతారని పేర్కొన్నారు. ఎంతో ఎత్తుగడలతో ముందుకెళ్లిన మహాకూటమి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విఫలమైందని అన్నారు. తెలంగాణా ఎన్నికల్లో కూటమి పేరు చెప్పి వచ్చిన చంద్రబాబు కి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. సిద్ధాంతాలను పక్కనపెట్టి చంద్రబాబు కాంగ్రెస్‌ పక్కన చేరారని మండిపడ్డారు. కెసిఆర్ కి మోడీ సపోర్ట్ గ ఉన్నారనే చంద్రబాబు మాటలను తిప్పి కొట్టారు. మోడీ సహాయం తోనే కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారని చంద్రబాబు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతే కాకుండా జాతీయ స్థాయిలో కెసిఆర్ కూటమిని ఏర్పాటు చేస్తున్నారన్న విషయం తనకు తెలియదని పేర్కొన్నారు.Top