కాంగ్రెస్ పార్టీ కి షాక్ ఇచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్..!

By Xappie Desk, January 02, 2019 10:39 IST

కాంగ్రెస్ పార్టీ కి షాక్ ఇచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్..!

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో కెసిఆర్ అత్యధిక మెజార్టీ స్థానాలు గెలవడంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలామంది రాజకీయ నేతలు రాజకీయంలో భవిష్యత్తు ఉండాలంటే టిఆర్ఎస్ పార్టీ లోనే ఉండాలని చాలా మంది ఆ పార్టీలో చేరడానికి క్యూ కడుతున్నారు.
 
ఈ నేపథ్యంలో తాజాగా ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. 2009లో కాంగ్రెస్ పార్టీ లో అడుగు పెట్టి రాజకీయాల్లో రాణించాలని చూసిన అజారుద్దీన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొరాదాబాద్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. అయితే ఆ తర్వాత 2014 ఎన్నికలలో ఎక్కడా కూడా పోటీ చేయకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అధిష్టానం చేత నియమితులై సేవలందించారు.
 
అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మహా కూటమి ఘోరంగా ఓడిపోవడంతో భవిష్యత్ రాజకీయాల్లో రాణించాలంటే టిఆర్ఎస్ పార్టీ కరెక్ట్ అని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలతో సంప్రదింపులు జరిపినట్లు.. రాబోయే ఎన్నికల్లో సికింద్రబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు అందుకు కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం అధికారికంగా ఎక్కడా కూడా బయటకు రాకపోవడం గమనార్హం.Top