మోడీ పాలన పై విమర్శనాస్త్రాలు విసిరిన చంద్రబాబు..!

By Xappie Desk, January 02, 2019 10:41 IST

మోడీ పాలన పై విమర్శనాస్త్రాలు విసిరిన చంద్రబాబు..!

2014 ఎన్నికలలో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భారత ప్రధాని మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ముఖ్యంగా విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ టిడిపి పార్టీ ని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వార్ధ రాజకీయాలకోసం వాడుకున్నారని ప్రధాని మోడీ వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని సెటైర్లు వేశారు చంద్రబాబు. ఇటీవల ఏఎన్‌ఐతో ముఖాముఖిలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ధీటుగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు సవాల్‌ విసిరారు. ప్రధాని నరేంద్ర మోదీ వల్ల దేశానికి ఏం లాభం జరిగిందో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. కేంద్రం సాధించిన వృద్ధి రేటు ఏముంది?, నోట్ల రద్దు, జీఎస్టీతో మీరు ఆర్థికాభివృద్ధి ఏం సాధించారు? అని ప్రశ్నించారు. తీసుకున్న నిర్ణయాలు అన్నీ దేశంలో ఉన్న సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేసిందని దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతినేలా చేశాయని పేర్కొన్నారు. మోదీ తీసుకున్న చర్యల వల్ల దేశంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రధాని, భాజపా జాతీయ అధ్యక్షుడు తెలంగాణలో పర్యటించినా గెలిచింది ఒక్క సీటేనన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మిమ్మల్ని ఎన్నెన్ని మాటలు అన్నారో గుర్తులేదా అని మోదీని ప్రశ్నించారు.Top