రాబోయే ఎన్నికల్లో పవన్ తో చంద్రబాబు..?

రాబోయే ఎన్నికల్లో పవన్ తో చంద్రబాబు..?

తాజాగా ఇటీవల మీడియాతో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు జనసేన పార్టీతో పొత్తు గురించి మరియు పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కలకలం రేపుతున్నాయి. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీ మళ్లీ కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు పొత్తుకి మెండైన అవకాశాలు ఉన్నట్లు అర్థమవుతుంది అని అంటున్నారు చాలామంది రాజకీయ పరిశీలకులు.
 
ఇటీవల మీడియా సమావేశంలో చంద్రబాబుకు ని మీడియా ప్రతినిధి ఒకరు ఈ విధంగా ప్రశ్నించారు. జనసేన మరియు టిడిపి గురించి జగన్ చేస్తున్న కామెంట్ల పై మీ కామెంట్ ఏమిటి అని. దీంతో స్పందించిన చంద్రబాబు పవన్ – టీడీపీ కలిసి పోటీ చేస్తే జగన్ కు బాధేంటి? అని ప్రశ్నించిన ఆయన.. అసలు జగన్ ఎవరితో ఉన్నాడో ఎవరితో వెళ్తున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు.
 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాతో కలుస్తాడన్న అక్కసుతోనే జగన్ తిడుతున్నడని, అది కూడా ఈ మధ్యనే చాల ఎక్కువైందని చంద్రబాబు అన్నారు. వాస్తవంగా చెప్పాలంటే జగన్ – మోడీ- కేసీఆర్‌ మధ్యనే స్నేహం ఉందని, పవన్ ఆ టీమ్‌లో లేరనే రీతిలో పరోక్ష వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. అయితే పవన్ కళ్యాణ్ తో పొత్తు గురించి ఆయన స్పష్టత ఇవ్వలేదు.Top