పవన్ కళ్యాణ్ కి ఎన్నికల్లో సినిమా ఇండస్ట్రీ మద్దత్తు..?

By Xappie Desk, January 02, 2019 16:39 IST

పవన్ కళ్యాణ్ కి ఎన్నికల్లో సినిమా ఇండస్ట్రీ మద్దత్తు..?

సినీ ఇండస్ట్రీ లో అతి తక్కువ సినిమాలు చేసి తన అన్న చిరంజీవి స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు తమ్ముడు పవన్ కళ్యాణ్. అయితే సమాజం మీద ప్రేమతో మరియు సామాన్యుల పై ప్రభుత్వాలు పెడుతున్న భారాలను చూసిన పవన్ కళ్యాణ్ కచ్చితంగా రాజకీయాల్లో రాణించాలని సినిమాలకు స్వస్తి చెప్పి తన పూర్తి శేష జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించి ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నారు.

ఈ క్రమంలో అతి తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల స్థాయిలో తాను స్థాపించిన జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అయితే ఒక్కసారి జనసేన పార్టీకి ప్రజల నుండి ఆదరణ చూస్తే కచ్చితంగా యువతరం నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో త్వరలో ఏపీలో ఎన్నికలు వస్తున్న క్రమంలో యూత్ ఓటుబ్యాంకు కలిగి ఉన్న జనసేన టాలీవుడ్ సెలెబ్రిటీల మద్దతు కూడా కూడగట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో సినిమా పరిశ్రమ మద్దతు ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి ఉండేది. అయితే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యాక చాలామంది సినిమా పరిశ్రమకు చెందిన వారు పవన్ కళ్యాణ్ సమాజంపై ఉన్న అవగాహన బట్టి కచ్చితంగా పాలిటిక్స్లో రాణిస్తారని ఆయనకు చాలా మంది మద్దతు తెలపడానికి రాబోయే రోజుల్లో సిద్ధమవుతున్నట్లు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న అతిపెద్ద టాక్. ఈ క్రమంలో ఇప్పటికే సొంత అన్న నాగబాబు కూడా సోషల్ మీడియాలో జనసేన పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు చేయడం విశేషం.Top