ప్రత్యేక విమానాలు ఖర్చు సంగతి ఏంటి బాబు అంటున్న వైసిపి నేతలు..!

By Xappie Desk, January 03, 2019 10:46 IST

ప్రత్యేక విమానాలు ఖర్చు సంగతి ఏంటి బాబు అంటున్న వైసిపి నేతలు..!

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల శ్వేత పత్రాలు విడుదల చేస్తూ ఎన్నికల వేడి పెంచుతున్నారు. మోడీ ఆంధ్ర రాష్ట్రానికి రానున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేసిందన విషయంపై ప్రజలకు క్లారిటీ ఉండాలని తనదైన శైలిలో పత్రాలు విడుదల చేస్తూ ఏపీ బీజేపీ నేతలకు కంగారు పుట్టిస్తున్నారు. ఇదిలావుండగా చంద్రబాబు ఇతర రాష్ట్రాలకు పర్యటించే క్రమంలో ప్రత్యేక విమానాలకు పెట్టిన ఖర్చు గురించి కూడా శ్వేత పత్రాలు విడుదల చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

అంతేకాకుండా చంద్రబాబు పలు రకాల శ్వేతపత్రాలు అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే ఆయన తిరిగి ప్రత్యేక విమానాల గురించి శ్వేతపత్రం విడుదల చేయాలని వైసీపీ నేతలు అంటున్నారు. ప్రత్యేక హోదా కోసం తొలి నుంచి పోరాడుతున్న ఏకైక నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రమేనన్నారు. హోదా వద్దు ప్యాకేజీ ముద్దన్న చంద్రబాబు.. ఇప్పుడు యూటర్న్‌ తీసుకొని నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.Top