ప్రకాష్ రాజ్ కి జై కొట్టిన కేటీఆర్..!

By Xappie Desk, January 03, 2019 10:55 IST

ప్రకాష్ రాజ్ కి జై కొట్టిన కేటీఆర్..!

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ రాబోయే లోక్సభ ఎన్నికలకు పోటీ చేస్తానని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ నటుడు ప్రకాష్ రాజ్ కి మద్దతు తెలిపారు. ఇటీవల కెటిఆర్ ను ప్రకాష్ రాజ్ కలిశారు.ఈ సందర్భంగా కెటిఆర్ ఆయనకు అభినందనలు తెలియజేస్తూ రాజకీయాల్లో రాణించాలని అబిలషించారు.

శాసనసభ ఎన్నికల సందర్భంగా ధైర్యంగా ముందుకొచ్చి తమకు మద్దతు ఇచ్చినందుకు ప్రకాశ్‌రాజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణాత్మకంగా, నిక్కచ్చిగా వ్యవహరించే ప్రకాశ్‌రాజ్‌ లాంటి వ్యక్తులు ప్రస్తుతం రాజకీయాలకు అవసరమని, వారితోనే ప్రక్షాళన సాధ్యమని కెటిఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ మద్దతు తన రాజకీయ ప్రవేశానికి స్ఫూర్తినిచ్చిందంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజం కోసమే తాను రాజకీయాలలోకి వస్తున్నానని అన్నారు.

ఇదే విషయం సోషల్ మీడియాలో కూడా రావడంతో దేశంలో రాబోయే రాజకీయ తరం నవతరానికి నాంది పలుకుతుందని ఖచ్చితంగా దేశంలో కొత్త పవనాలు వీస్తున్నాయని.. దేశ ప్రజల బతుకులు మారే అవకాశాలు ఉన్నాయి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.Top