అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ కెసిఆర్ అంటున్న మాజీ ఎంపీ ..!

By Xappie Desk, January 03, 2019 11:09 IST

అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ కెసిఆర్ అంటున్న మాజీ ఎంపీ ..!

విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ కెసిఆర్ అని దానికి ఉదాహరణ ఆయన విశాఖపట్టణం పర్యటన అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విశాఖ పట్టణానికి వచ్చిన కేసీఆర్ ని చూడటానికి వేలాదిమంది వచ్చారని డాబాలపై భవనాలపై చేతులూపుతూ తనకు ఆంధ్ర ప్రజలు ఘనస్వాగతం పలికారు అని మీడియా ముందు దారుణమైన అబద్దాలు చెప్పారని అసలు కేసీఆర్ పర్యటన లో ఎవరో కూడా కేసీఆర్ ని ఆంధ్రాలో పట్టించుకోలేదని కెసిఆర్ చెప్పిన వన్నీ అబద్ధాలు అని పేర్కొన్నారు సబ్బం హరి.

అంతేకాకుండా కెసిఆర్ చెప్పిన మాటలు నిజమే అయితే ఎయిర్ పోర్టులో దిగి స్వరూపానందేంద్ర పీఠం వరకు లెక్కపెడితే 150 నుంచి 200 మంది కంటే ఎక్కువ మంది ఉన్న ఒక్క వీడియో క్లిప్ అన్నా చూపాలని కోరారు. ఆయనను చూడటానికి వచ్చిన వారిలో 30 మంది తెలంగాణ పోలీసులే ఉన్నారని చెప్పారు. ఒకవేళ క్లిప్ చూపిస్తే.. మరోసారి కేసీఆర్‌పై విమర్శలు చేయనన్నారు. ఓ టీవీ ఛానల్‌ చర్చావేదికలో సబ్బం ఈ విషయాలు తెలిపారు. దీంతో సబ్బం హరి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.Top