రాబోయే రోజుల్లో ప్రధానిని మేమే డిసైడ్ చేస్తామంటున్న కేటీఆర్..!

By Xappie Desk, January 03, 2019 11:16 IST

రాబోయే రోజుల్లో ప్రధానిని మేమే డిసైడ్ చేస్తామంటున్న కేటీఆర్..!

తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ పార్టీ పగ్గాలను తన తనయుడు టిఆర్ఎస్ పార్టీలో కీలక నాయుడు కేటీఆర్ చేతిలో పెట్టి జాతీయ రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టారు కేసీఆర్. ఈ నేపథ్యంలో తాజాగా ఇటీవల హైదరాబాద్ నగరంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ జాతీయ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ మాట్లాడుతూ…” ఉద్యమ నాయకుడు ఉద్యమ ఫలితాలను ప్రజలకు చూపించి రెండో సారి ముఖ్యమంత్రి కావడం దేశంలోనే రికార్డుగా కేటీఆర్‌ అభివర్ణించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా కేసీఆర్‌ పట్ల ప్రజలు విశ్వాసం ప్రకటించారని వివరించారు. భాజపా, కాంగ్రెస్‌, తెదేపా నుంచి హేమాహేమీలు వచ్చి ప్రచారం చేసినా కేసీఆర్‌కే ప్రజలు పట్టం కట్టారన్నారు. దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో అత్యధిక ఎమ్మెల్యే సీట్లు గెలిచి చరిత్ర సృష్టించామని” కేటీఆర్ ప్రసంగించారు.

అంతేకాకుండా రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో వారి స్థానాలు గెలిచి మరొకసారి టిఆర్ఎస్ పార్టీ సత్తా తెలియజేయాలని.. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి దేశమంతా చర్చించుకున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దేశ ప్రధానిని నిర్ణయించేది మనమేనని ఈ సందర్భంలో ధీమాగా తెలియజేశారు కేటీఆర్.Top