కిడ్నీ వ్యాధిగ్రస్తులు బాధ విని చలించిపోయిన జగన్..!

By Xappie Desk, January 03, 2019 11:38 IST

కిడ్నీ వ్యాధిగ్రస్తులు బాధ విని చలించిపోయిన జగన్..!

ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఈనెల 9వ తారీఖున ముగింపు పలకబోతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ చివరి రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ సభ చాలా గ్రాండ్ గా జరగాలని పార్టీ నేతలు మరియు కార్యకర్తలు ఎంతగానో కృషి చేస్తున్నారు. మరోపక్క పాదయాత్రలో ఉన్న జగన్ తన దగ్గరకు వచ్చిన ప్రతి సమస్యలు వింటూ ప్రజలకు భరోసా ఇస్తూ ధైర్యాన్నిస్తూ ముందుకు సాగుతున్నారు.

ఈ క్రమంలో ఇచ్చాపురంలో ప్రవేశించిన వైఎస్ జగన్ దృష్టికి కిడ్నీ వ్యాధిగ్రస్తులు కలిశారు. వారికున్న ప్రతి సమస్యను జగన్ దృష్టికి తీసుకువచ్చారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందటం లేదని ప్రతిపక్ష నేత జగన్ తో మొరపెట్టుకున్నారు. అంతేకాకుండా రోగులకు సరిపడా డయాలసిస్‌ సెంటర్‌లు కూడా లేవని చెప్పారు. కిడ్నీ, తిట్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ప్రజాప్రతినిధులు వివక్షత చూపిస్తున్నార‌ని జ‌గ‌న్‌కు త‌మ గోడును వెల్ల‌బోసుకున్నారు.

దీంతో వారి సమస్యలు విన్న జగన్ చలించిపోయారు కచ్చితంగా వైసీపీ అధికారంలోకి రాగానే కిడ్నీ బాధితుల‌కు రూ.10,000 పెన్స‌న్ ఇస్తామ‌ని…స‌రిప‌డా డ‌యాల‌సిస్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు. దీంతో పాటు కిడ్నీ రీసెర్చ్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు. అలాగే మంచినీటి విషయంలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకుని ఇటువంటివి పునరావృతం కాకుండా ప్రజల ఆరోగ్యాలను కాపాడే విధంగా వంశధార మహేంద్రతనయ నుంచి సురక్షిత మంచి నీటి ని అందిస్తామని హామీ ఇచ్చారు జగన్.Top