బహిరంగ చర్చకు వస్తావా చంద్రబాబు అంటూ సవాల్ విసిరిన ఉండవల్లి..!

By Xappie Desk, January 03, 2019 17:58 IST

బహిరంగ చర్చకు వస్తావా చంద్రబాబు అంటూ సవాల్ విసిరిన ఉండవల్లి..!

ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి. తాజాగా ఇటీవల చంద్రబాబు చేసిన చేత పత్రాలపై చర్చకు రావాలని సవాల్ కూడా విసిరారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నేతల్లో ఎవరు వచ్చినా నేను రెడీ అంటూ పేర్కొన్నారు. శ్వేత పత్రం లో ఉన్నవి మరియు వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని ముఖ్యంగా రాష్ట్ర జీవనాడి ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు గురించి శ్వేత పత్రం ఎందుకు విడుదల చేయలేదని చంద్రబాబు ని డిమాండ్ చేశారు. 60 సి నిబంధనను అడ్డుపెట్టుకుని పోలవరం పనుల్లో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులను ఇష్టారాజ్యంగా కట్టబెడుతున్నారని ఉండవల్లి విమర్శించారు. శ్వేతపత్రంలో వెల్లడించిన ఎల్‌ఈడీ బల్బుల కాంట్రాక్టులో భారీ దోపిడీ జరిగిందని ఆరోపించారు.

తెలంగాణాలో చంద్ర‌బాబు అతి ప్ర‌చారమే కూట‌మి కొంప ముంచింద‌న్నారు. బాబు ప్ర‌చారానికి పోకుంటే ప‌రిస్థితి మ‌రో విధంగా ఉండేద‌న్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే... ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలని చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. ఇదే క్రమంలో ప్రతిపక్షనేత వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.. కచ్చితంగా పాలిటిక్స్లో తండ్రిని మించిన తనయుడు అవుతాడని రాజశేఖర్ రెడ్డి కంటే గొప్పవాడు జగన్ అవుతాడని పేర్కొన్నారు. దేశంలో ఏ పాదయాత్రకు ఇంతమంది జనం రాలేదని తన తండ్రి రాజశేఖర్ రెడ్డి కంటే అద్భుతంగా జగన్ మాట్లాడుతున్నాడని ఏదో మెప్పు కోసమో కాదు గాని ఉన్న వాస్తవం కనబడుతుందని ఈ సందర్భంగా అన్నారు ఉండవల్లి.Top