టీడీపీ విడుదల చేసిన శ్వేత పత్రాలపై సీరియస్ అయిన మోడీ..!

By Xappie Desk, January 03, 2019 18:24 IST

టీడీపీ విడుదల చేసిన శ్వేత పత్రాలపై సీరియస్ అయిన మోడీ..!

ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ఏమి జరిగింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంత ఇచ్చింది అన్న విషయాలపై శ్వేత పత్రాలు విడుదల చేశారు. అయితే చంద్రబాబు చేసిన శాతం పత్రాలపై చాలామంది రాజకీయ నేతలు ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు అనేకమంది విమర్శలు చేస్తున్న క్రమంలో తాజాగా ప్రధాని మోడీ చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రాలపై సీరియస్ అయినట్లు సమాచారం. ఇటీవల విశాఖపట్టణం జిల్లాకు చెందిన బీజేపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మోడీ చంద్రబాబు వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారట.

అంతేకాకుండా రాష్ట్రానికి ఎన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం వచ్చిందో వాటినన్నిటిని దుర్వినియోగం చేసినట్లు అన్ని విధాల సహకరించిన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేశారని ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని వీడియో కాన్ఫరెన్స్ లో బిజెపి కార్యకర్తలకు ప్రధాని మోడీ సూచించారట. అంతేకాకుండా ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఏపీ ప్రభుత్వం మాత్రం అందలేదని చెబుతోందని, ఆ డ‌బ్బు ఎవ‌రి జేబుల్లోకి వెళ్ళిందని మోదీ ప్రశ్నించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు నీతి ఆయోగ్ కోరితేనే తాము పోల‌వ‌రం నిర్మాణబాధ్య‌త‌లు చేప‌ట్టామ‌ని ఒక‌వైపు ముఖ్య‌మంత్రి చెబుతుంటే.. ప్ర‌ధాదీనికి భిన్నంగా స్పందించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం కోరితేనే పోల‌వ‌రం ప్రాజెక్టుల‌ను అప్ప‌గించామ‌ని మోదీ వెల్ల‌డించారు. పోలవరానికి వంద‌శాతం కేంద్రం డబ్బులు ఇస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు పోలవరానికి రూ. 7 వేల కోట్లు ఇచ్చామని, ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం అడిగిందని మోదీ పేర్కొన్నారు. దీంతో మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో కలకలం రేపుతున్నాయి. మరి మోడీ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.Top