కూకట్ పల్లి ఎమ్మెల్యే చిరంజీవికి ధన్యవాదాలు..! అసలేం జరిగింది అక్కడ ?

By Xappie Desk, January 03, 2019 20:22 IST

కూకట్ పల్లి ఎమ్మెల్యే చిరంజీవికి ధన్యవాదాలు..! అసలేం జరిగింది అక్కడ ?

మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం బాగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. టీడీపీ కంచుకోటగా చెప్పబడే ఈ నియోజకవర్గంలో అందరినీ విస్మయపరుస్తూ టీఆరెఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు 41,000 ఓట్ల మెజారిటీతో నందమూరి సుహాసిని పై గెలుపొందాడు. అయితే ఇక్కడ అంతకన్నా ఆశ్చర్యం ఏమిటంటే, తాజాగా మాధవరం చిరంజీవిని కలిశాడు.

తన విజయానికి సంబంధించి మాధవరం చిరుకి కృతజ్ఞతలు చెప్పినట్లు సమాచారం. అయితే ముందుగా అందరూ అనుకున్నట్లు టిఆర్ఎస్ మరియు టిడిపి మధ్య కూకట్ పల్లి నియోజకవర్గం లో హోరాహోరీ పోరు తప్పదనుకుంటే, నందమూరి అభిమానులు కూడా సుహాసిని తరపున పెద్ద ఎత్తున పని చేశారు. కానీ ఇక్కడ విశేషమేమిటంటే మెగా అభిమానులు, ఒక సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రం మాధవరం వైపు మొగ్గు చూపారు. చివరికి అదే ఫలితాన్ని నిర్దేశించడం తో మాధవరం చిరంజీవిని కలిశారు.

చిరంజీవి మరియు మాధవరం కృష్ణారావు కు సంబంధించిన సన్నిహిత వర్గాలు మాత్రం వారి మీటింగ్ ని కేవలం నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకునేందుకు కలిశారు అని చెప్పుకొస్తున్నా… రాజకీయ వర్గాల్లో మాత్రం మాధవరం విజయానికి చిరంజీవి ఇచ్చిన ఇన్ డైరెక్ట్ సపోర్ట్ వల్లే వీరి మీటింగ్ ఏర్పడిందని గట్టిగా వినిపిస్తున్న మాట. ఎప్పటినుండో చిరు కాంగ్రెస్ ను వీడనున్నారు అనే వాదన కూడా ఇక్కడ బలంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సన్నివేశం దానికి ఊతం ఇస్తోందని చెప్పాలి. కాంగ్రెస్ తో కలిసి టీడీపీ కూటమి ఏర్పాటు చేసిన తరువాత కూడా చిరు ఇలా చేయడం పై ఇప్పుడు ఆ సందేహాలు ఇంకా బలమయ్యాయి.Top