లాజిక్ లేని శివాజీ మళ్లీ వచ్చాడు - పవన్ మీద బాబు విరిగిపోయిన బాణం ఇతనే..?

లాజిక్ లేని శివాజీ మళ్లీ వచ్చాడు - పవన్ మీద బాబు విరిగిపోయిన బాణం ఇతనే..?

సినీ నటుడు శివాజీ ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ 'బి' అంటూ కొద్దిరోజులు రాష్ట్ర రాజకీయాలలో హల్ చల్ చేశాడు. జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి తరువాత బాగా బాగా నానిన అతని పేరు జనాలు మరచిపోయేందుకు పెద్దగా సమయం పట్టలేదు. ఇప్పుడు అతను ఆపరేషన్ ఆఫీసర్స్ అంటూ కొత్త విషయాన్ని బయటకు తీశాడు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన విలేఖరులతో ఈ లాజిక్ లేని విషయమై వాగ్వాదానికి కూడా దిగాడు అసలు అతను ముందు నుండి చెప్పిన మాటలని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు చంద్రబాబుకి మద్దతుగా ఆయన చుక్క భూములపై మాట్లాడుతూ, కొంతమంది అధికారులు సరిగ్గా పని చేయకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు అని, వారిని ముఖ్యమంత్రి అదుపు చేయలేకపోతే ఈయన వెళ్లి ఆయనకే ఫిర్యాదు చేస్తాను అని చెప్పడం అక్కడ హాస్యాస్పదంగా మారింది.

ఇక రామ్ గోపాల్ వర్మ లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా పై మాట్లాడుతూ తాజాగా విడుదలైన గేయంలో అందరూ చంద్రబాబు ని వెన్నుపోటుదారుడిగా చూస్తే తనకు బాబు వెన్ను దన్నుగా అన్నగారికి నిల్చున్నారు అని అన్నాడు. దానిని రాముడు వాలిని వెనక నుండి దెబ్బతీసిన విషయాన్ని ఇక్కడ ఉదాహరణ గా చూపించడం గమనార్హం. ఈయన లాజిక్ లేని మాటలు చూసి విలేఖరులు తెగ నవ్వుకున్నారు.

అయితే ఇప్పుడు శివాజీని అందరూ బాబు ఒక అస్త్రంగా వాడుతున్నారని అంటున్నారు. జగన్ పై జరిగిన దాడితో కొంత వరకు ఈ విషయమై అనుమానం మొదలయింది. ఇప్పుడు పవన్ తిరిగి టీడీపీలో కలిసే అవకాశాలు సన్నగిల్లడంతో రానున్న రోజుల్లో బాబు శివాజీని పవన్ కు చెక్ పెట్టేందుకు వదులుతారు అని అర్ధవుతుంది. అయితే పంక్చర్ అయిన బండిని వదిలి ఏం లాభం అని అందరూ పెదవి విరుస్తున్నారు. పవన్ ఇప్పుడున్న ఊపులో సర్వత్రా నవ్వులపాలు అవుతున్న శివాజీ కాని అతనికి ఎదురైతే అతని పరిస్థితి ట్రాక్టర్ కింద పడిన గజనిమ్మకాయ అవుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు.Top