ఏపీ లో హాట్ టాపిక్ అయిన విజయసాయిరెడ్డి కామెంట్స్..!

By Xappie Desk, January 04, 2019 11:02 IST

ఏపీ లో హాట్ టాపిక్ అయిన విజయసాయిరెడ్డి కామెంట్స్..!

వైసిపి సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న క్రమంలో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. రాబోయే ఎన్నికలలో గెలవడం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆధార పడ్డారని ఎలాగైనా పవన్ కళ్యాణ్ ని దగ్గర తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇది గత కొంతకాలం నుంచి జరుగుతున్న ప్రయత్నమేనని ఆయన అన్నారు. అదికారం పోతుందన్న భయంతో చంద్రబాబు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తాము జనసేనతో టిడిపి టచ్ లోనే ఉందని ఎప్పటి నుంచో అనుమానిస్తున్నామని ఆయన అన్నారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జనసేనతో సంబందాలు కొనసాగించాలని చంద్రబాబు చూస్తున్నారని అన్నారు.

మొన్నటి వరకు తమ పార్టీకి, జనసేనకు బిజెపితో సంబందాలు అంటగట్టి,ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను తనవైపు లాక్కొనే యత్నం చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవ చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలకు నిస్వార్థంగా పని చేస్తుంది ఎవరో పోరాటం చేస్తుంది ఎవరో అంత అర్థమవుతుందని అది వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందని పేర్కొన్నారు.Top