అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో జగన్ కి సలహా ఇస్తున్న ప్రభుత్వ పెద్దలు..?

అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో జగన్ కి సలహా ఇస్తున్న ప్రభుత్వ పెద్దలు..?

ఏపీ రాష్ట్రం లో అగ్రిగోల్డ్ బాధ్యతలు గత కొంత కాలం నుండి ఆందోళనలు నిరసనలు కొంచెం గట్టిగా చేస్తున్నారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు వస్తున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ ఉంటుందో లేదో అన్న ఆందోళనతో ఏమో తెలియదు గానీ అగ్రిగోల్డ్ బాధితులు చేస్తున్న నిరసనలు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో గతంలో అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో కచ్చితంగా ఆదుకుంటామని తెలియజేసిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు కొత్త సలహా ఇస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత జగన్ అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.

ఈ కామెంట్లు చేసింది మరెవరో కాదు ఎపి ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు సి.కుటుంబరావు కావడం విశేషం. ఆయన మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్షాలు కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయని ఆయన అరోపించారు.

డిపాజిటర్లకు త్వరలోనే 200 కోట్లు నుంచి 300 కోట్లు నిదులను పంపిణీ చేస్తామని, ముందుగా ఐదువేల రూపాయల లోపు డిపాజిటర్లకు చెల్లించే ఆలోచన చేస్తున్నామని ఆయన అన్నారు. అయితే హైకోర్టులో కేసు పెండింగులో ఉందని ఆయన అన్నారు. హైకోర్టు విబజన వల్ల కేసు కొంత జాప్యం కావచ్చని అన్నారు. అగ్రిగోల్డ్ బాదితులపై ప్రేమ ఉంటే జగన్ అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.Top