శ్వేత పత్రాల విషయంలో చంద్రబాబు పై సీరియస్ అయిన తెలంగాణ ప్రభుత్వం..!

By Xappie Desk, January 04, 2019 11:14 IST

శ్వేత పత్రాల విషయంలో చంద్రబాబు పై సీరియస్ అయిన తెలంగాణ ప్రభుత్వం..!

ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతా పత్రాల విషయంలో కొంచెం అసత్యాలు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అవుతుంది. చేత పత్రాలలో schedule 9 10 లో ఆస్తులకు సంబంధించిన విషయాలలో వాస్తవం లేదని చంద్రబాబు ప్రభుత్వం పై సీరియస్ అవుతోంది. దీనిపై గట్టిగా సమాదానం ఇవ్వాలని ఆ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబందించి వివరాలతో నివేదికలు సిద్దం చేయాలని అదికారులను ఆదేశించారు.

ఈ సెడ్యూళ్లలోని సంస్థల ఆస్తులకు సంబందించి చట్టంలో క్లారిటీ ఉందని, ఆ సంస్థల సదుపాయాలను రెండో రాష్ట్రం అందించాలని నిర్దిష్టం గా ఉందని తెలంగాణ అదికారులు చెబుతున్నారు. కాని ఎపి ప్రభుత్వం కావాలని ఈ అంశాన్ని వివాదం చేయాలని ప్రయత్నిస్తోందని ,దీనిని తిప్పికొట్టడానికి తాజా పరిస్థితులతో నివేదికలను తెలంగాణ ప్రభుత్వం సిద్దం చేస్తోందని కధనం. ఇదే క్రమంలో మరికొంతమంది తెలంగాణ నేతలు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికి కుటిలమైన ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.Top