జగన్ పార్టీలోకి వెళ్లడానికి ఇష్టపడుతున్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు..?

By Xappie Desk, January 04, 2019 11:27 IST

జగన్ పార్టీలోకి వెళ్లడానికి ఇష్టపడుతున్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు..?

ఎన్టీఆర్ హయాంలో టీడీపీ లో ఉన్న చాలామంది ఇప్పుడు వైసిపి పార్టీ లోకి చేరడానికి క్యూ కడుతున్నారు. గతంలో చంద్రబాబు కారణంగా విభేదాలు వచ్చినవారు చంద్రబాబు పై ప్రతీకారం తీర్చుకోవడానికి జగన్ పార్టీలోకి వెళ్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో జగన్ పార్టీలో వెళ్లడానికి ముందు వరుసలో ఉన్నారు దగ్గుబాటి పురందేశ్వరి. గతంలో రాజశేఖర్రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం జ‌రిగిన ప‌రిణామాల కార‌ణంగా కాగ్రెస్‌ను వీడి భార‌తీయ జ‌న‌తా పార్టీని ఆశ్ర‌యించారు.

గ‌త కొంత కాలంగా రాష్ట్ర రాజ‌కీయాల్లో త‌న‌కు ప్రాధాన్యత‌ త‌గ్గ‌డం, కొడుకుని రాజ‌కీయాల్లోకి తీసుకురావాల‌న్న ఆలోచ‌న వంటి బ‌ల‌మైన కార‌ణాల‌తో బిజీపీని కూడా వీడాల‌నుకుంటోందని ప్ర‌చారం జ‌రుగుతోంది. కొడుకు హితేష్‌ రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం ఇప్ప‌టికే పావులు క‌ద‌ప‌డం మొద‌లుపెట్టిన పురంధేశ్వ‌రి వైసీపీలోకి వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

వైసీపీ ఎంపీ, జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడైన విజ‌య‌సాయిరెడ్డితో గ‌త కొంత కాలంగా పురంధేశ్వ‌రి ట‌చ్‌లో వుంటున్నార‌ని, దీనిపై జ‌గ‌న్ కూడా సానుకూలంగా వున్న‌ట్లు చెబుతున్నారు. ఇక జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం అని ఎప్పుడైతే ఫైనల్ కాల్ జగన్ ఇస్తారో వెంటనే బిజెపిని విడి వైసీపీలో చేరడానికి దగ్గుబాటి పురందేశ్వరి ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో వైసీపీ పార్టీలో దగ్గుబాటి పురందేశ్వరి చేరితే మాత్రం కచ్చితంగా చంద్రబాబుకి రాబోయే ఎన్నికల విషయంలో చాలా డ్యామేజ్ అవుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.Top