తాజా రాజకీయాలపై సంచలన కామెంట్స్ చేసిన సబ్బం హరి..!

By Xappie Desk, January 04, 2019 11:38 IST

తాజా రాజకీయాలపై సంచలన కామెంట్స్ చేసిన సబ్బం హరి..!

తాజాగా ఇటీవల విశాఖపట్టణం మాజీ ఎంపీ సబ్బం హరి చేసిన కామెంట్లు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశమయ్యాయి. త్వరలో ఏపీలో ఎన్నికలు వస్తున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే మళ్లీ అభివృద్ధి కొనసాగుతుందని రాష్ట్రం బాగుపడుతుందని ఇదే విషయం ఏపీ ప్రజలు నమ్ముతున్నారని సబ్బం హరి తెలిపారు. చంద్రబాబు స్థానంలో ఎవరైనా వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయితే కచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి అటకెక్కుతోంది అని కామెంట్లు చేశారు. చంద్రబాబు రాజకీయాన్ని ఆయన గెలుపుని అడ్డుకోవాలని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన అది జరిగే పని కాదని సబ్బం హరి అన్నారు.

అంతేకాకుండా జగన్ సీఎం కావాలని కొందరు - పవన్ ముఖ్యమంత్రి కావాలని మరికొందరు కోరుకుంటున్నారని... అయితే ఎంత శాతం మంది కోరుకుంటున్నారనే విషయం ఎన్నికల్లో తెలుస్తుందని చెప్పారు. బీజేపీ అధికారంలోకి రావాలని ఏ ఒక్కరూ కోరుకోవడం లేదని సబ్బం హరి తెలిపారు. ఇదే క్రమంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సబ్బం హరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేసీఆర్ తాను విశాఖ వచ్చినప్పుడు ప్రజలు వేలకొద్ది వచ్చారని చేసిన కామెంట్లపై మండిపడ్డారు.. కెసిఆర్ చెబుతున్నవన్నీ అబద్ధాలని పేర్కొన్నారు.Top