నన్నెవరూ ఆపలేరు విజయవాడలో పవన్ సంచలన వ్యాఖ్యలు..!

నన్నెవరూ ఆపలేరు విజయవాడలో పవన్ సంచలన వ్యాఖ్యలు..!

ఇటీవల విజయవాడలో ఏర్పాటు చేసిన నాయకుల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రయత్నాలు చేసినా ప్రజల నుండి నన్ను ఎవరు వేరు చేయలేరు అని.. వాళ్లను నా దగ్గర రాకుండా ఆపడం ఎవరి తరం కాదని నేను వారి కోసం పని చేయడానికి వచ్చిన శ్రామికుడు నని ప్రవాహం లాంటి వాడిని నన్ను కూడా ఎవరూ ఆపలేరని పవన్ కళ్యాణ్ ఆవేశపూరితంగా మాట్లాడారు.

రాజకీయాలలో రాణించాలంటే పేరు ప్రఖ్యాతలు ఉన్నంత మాత్రాన సరిపోదని ఓపిక ఉండాలని పార్టీలు స్థాపించిన వాటిని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలంటే సమాజంపై బాధ్యత ప్రేమ ఉండాలని ప్రజల కోసం పనిచేసే మంచి ఆలోచనలు ఓపిక సహనం ఉంటే కచ్చితంగా రాజకీయాల్లో రాణిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. నేను చిన్నప్పటినుండి ఈ లక్షణాలన్నింటిని అలవర్చుకోవడం వలెనే ఈ రోజు ఇంత సహనంగా ఉండగలుగుతున్నానని పవన్ చెప్పారు. ఎవరినో అవహేళన చేయడం వలన మనకి పదవులు దక్కవని, దానికి ఎంతో కష్టపడాలని పవన్ ప్రసంగించారు. అధికారం లోకి రావాలని కోరుకోండి కానీ..అధికారదాహంతో ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని పేర్కొన్నారు పవన్.Top