ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు..!

By Xappie Desk, January 05, 2019 11:03 IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు..!

తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో సంతోషిస్తున్నారు. ఇన్నాళ్లకి చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారని చంద్రబాబుపై ప్రవర్తన వర్షం కురిపిస్తున్నారు. ఎన్నో మంచి పనులు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉందని అందరు గొప్పగా చెప్పుకుంటున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు సొంతిళ్ల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొంతిళ్లు లేని ఉద్యోగులకు గృహ వసతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. అపార్టుమెంట్లు కట్టించి ఫ్లాట్లు కేటాయించాలని సూచించారు. ఎక్కడైనా సరే అదనంగా ఉన్న భూములను గుర్తించి తక్షణమే ఈ పనులను ప్రారంభించాలని చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు రాష్ట్రంలో అదనంగా ఉన్న భూములను గుర్తించే పనిలో పడ్డారు. మొత్తంమీద ఎన్నికల ముందు చంద్రబాబు తీసుకునే నిర్ణయం తెలుగుదేశం పార్టీకి ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.Top