కాకినాడలో చంద్రబాబును అడ్డుకున్న ఏపీ బీజేపీ నేతలు..!

By Xappie Desk, January 05, 2019 11:11 IST

కాకినాడలో చంద్రబాబును అడ్డుకున్న ఏపీ బీజేపీ నేతలు..!

గత కొంత కాలం నుండి టిడిపి మరీ బీజేపీ పార్టీల మధ్య ఆంధ్రప్రదేశ్లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నటు గా ఉంది. 2014 ఎన్నికలలో కలిసి పోటీ చేసిన ఈ రెండు పార్టీలు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల బట్టి నువ్వా నేనా అన్నట్టుగా ఇద్దరి మధ్య పోరు సాగుతుంది. ఈ క్రమంలో టీడీపీ.. కేంద్ర ప్రభుత్వం విభజన తో కూడిన ఆంధ్రరాష్ట్రం లో కష్టాలను గుర్తించి కూడా సాయం చేయకుండా అనేక విధాల ఇబ్బందుల పాలు చేసిందని ఆరోపించగా. మరో పక్క బిజెపి కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని కౌంటర్ లు వేస్తున్నారు. అయితే మరో పక్క రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న తరుణంలో బిజెపి పార్టీ తరఫున త్వరలో మోడీ ఆంధ్రరాష్ట్రంలో కి వస్తున్నారు అన్న వార్త బయటకి రావడంతో వెంటనే టిడిపి కార్యకర్తలు మోడీని మరియు బిజెపి పార్టీ పెద్దల పై దారుణమైన కామెంట్లు చేసి మోడీ పర్యటనను అడ్డుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేయడంతో.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చారు ఏపీ బీజేపీ నేతలు.

ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు కాకినాడ లో పర్యటించిన క్రమంలో చంద్రబాబు ను అడ్డుకుని ఏపీ బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల్లో అవినీతి జరుగుతోంద‌ని వారు పెద్దయెత్తున నినాదాలు చేశారు. కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో.. వాహ‌నం నుండి క్రింద‌కు దిగిన చంద్ర‌బాబు బీజేపీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారు. అసలు మీకు సిగ్గుందా.. రాష్ట్రానికి మోదీ అన్యాయం చేస్తుంటే నాకు వ్యతిరేకంగా నిర‌స‌న‌లు చేస్తూ న‌న్నే అడ్డుకుంటారా.. జాగ్ర‌త్త‌ నాతో పెట్టుకుంటే ఫినిష్ అవుతారు అంటూ వార్నింగ్ ఇచ్చారు. అసలు ఏపీలో అవినీతి ఎక్కడ జరిగింది.. ఇలా కార్యక్రమాలను అడ్డుకోవాలని చేస్తూ తీవ్ర చర్యలుంటాయని చంద్రబాబు హెచ్చరించారు.Top