వైసీపీలోకి క్యూ కడుతున్న సినీ ఇండస్ట్రీ..!

By Xappie Desk, January 05, 2019 11:24 IST

వైసీపీలోకి క్యూ కడుతున్న సినీ ఇండస్ట్రీ..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ పార్టీ హవా కొనసాగుతున్న క్రమంలో చాలా మంది రాజకీయాల్లోకి రాణించాలని చూస్తున్న వారు పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పాదయాత్రకు తెలుగు ఇండస్ట్రీ ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సినీ ప్రముఖులు చాలామంది జగన్తో కలసి పాదయాత్రలో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్నేహితుడు అయినా ఆలీ కూడా వైసిపి పార్టీ లోకి రావడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ఏపీ మీడియాలో వరుసగా కథనాలు వెలువడుతున్నాయి.

అంతేకాకుండా ఇటీవల వైసీపీ అధినేత జగన్ ని విమానాశ్రయంలో కూడా ఆలీ కలవడం జరిగింది. మొత్తంమీద చూసుకుంటే ఆలీ త్వ‌ర‌లో వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుత‌న్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టి ఆలీ టిక్కెట్ విష‌యంలో చ‌ర్చ‌లు జ‌రిగిపోయాయ‌ని జ‌గ‌న్ పాద‌యాత్ర ముగింపు రోజు ఇచ్ఛాపురంలో జ‌రుగ‌నున్న బ‌హిరంగ‌స‌భ‌లో జ‌గ‌న్ స‌మ‌క్షంలో ఆలీ వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నార‌ని వార్తలు జోరుగా ప్ర‌చారం అవుతున్నాయి. మ‌రి ఈవార్త‌లో నిజ‌మెంత ఉందో తెలియ‌దు కానీ ఆలీ వైసీపీలో చేరితే ఆ పార్టీకి సినీ గ్లామ‌ర్ కూడా పెరిగే చాన్స్ ఉంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. మరో పక్క పవన్ కళ్యాణ్ అభిమానులు ఆలీ పై సోషల్ మీడియాలో వరుసగా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.Top