ఏపీ రాజకీయాల్లో రసవత్తరంగా మారిన కమెడియన్ ఆలీ..!

By Xappie Desk, January 07, 2019 12:24 IST

ఏపీ రాజకీయాల్లో రసవత్తరంగా మారిన కమెడియన్ ఆలీ..!

మరికొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. అన్ని పార్టీలలో టికెట్ల గోల ఇప్పటికే మొదలైపోయింది. ఏపీ ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు ఎవరికి అర్థం కావడం లేదు.

ఈ నేపథ్యంలో చాలామంది ప్రముఖులు రాజకీయాల్లో రావడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో తెలుగు సినిమా రంగానికి చెందిన సీనియర్ కమెడియన్ ఆలీ పేరు ప్రస్తుతం తెలుగు రాజకీయాలలో మీడియా రంగాలలో వినపడుతోంది. ఆలీ ఏ పార్టీలో చేరుతారో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఇప్పటికే వైసిపి అధినేత జగన్ ని కలిసిన ఆలీ.. తర్వాత తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ అధ్యక్షులను కలవడం జరిగింది.

ఇలా మూడు పార్టీల అధ్యక్షులతో భేటీలు నిర్వహించిన అలీ మనసులో అసలు ఏముందో, ఆయన పొలిటికల్ ప్లాన్ ఏమిటో అర్థంకాక జనం ఈ లొల్లేమిటి అలీ అంటూ తలలు బాదుకుంటున్నారు. మరి చివరికి అలీ మజిలీ ఏ పార్టీలోకి అనేది తేలాలంటే ఆయనే స్వయంగా నోరు విప్పాలి. మరోపక్క వైసీపీ అధినేత జగన్ ఆలీ కి టికెట్ ఇచ్చేశారని ఈ నెల 9న ఆయన వైకాపాలో చేరిపోతారని ప్రచారం జోరుగా జరుగుతోంది.Top