ఏపీ మంత్రి కి చుక్కలు చూపించిన ఆ రెండు పార్టీలు..!

ఏపీ మంత్రి కి చుక్కలు చూపించిన ఆ రెండు పార్టీలు..!

విశాఖపట్టణం జిల్లా కి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మంత్రి గంటా శ్రీనివాసరావుకు సొంత నియోజకవర్గం భీమిలిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో తీవ్ర చేదు అనుభవం ఎదురయింది. ఇటీవల భీమిలి నియోజకవర్గంలో మధురవాడ ప్రాంతంలో కొమ్మాదిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న గంట ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలను మంత్రిగారి దృష్టికి సదరు నియోజకవర్గ ప్రజలు తీసుకో వస్తే కనీసం పట్టించుకోలేదని ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులు తెలిపారు.

అంతేకాకుండా ఆ మీటింగు అయ్యాక అయినా సరే వారి సమస్యలను వింటారా అంటే అది కూడా చెయ్యకుండా ఆయన యొక్క కారులో వెళ్లిపోతున్న సమయంలో అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. దానితో వారి సమస్యను తెలుసుకున్న జనసేన మరియు వైసీపీ పార్టీ శ్రేణులు బాధితులకు అండగా ఉండి గంటా శ్రీనాసరావు కారుకు అడ్డంగా నిల్చి వారిని కదలనివ్వలేదు. అక్కడే ఆపి గంటాకు మరియు తెలుగుదేశం పార్టీకు వ్యతిరేఖంగా నినాదాలు చేపట్టి గంటా శ్రీనివాసరావు మరియు ఆయన యొక్క సిబ్బందికి చుక్కలు చూపించారు. ఇంత జరిగినా గాని గంటా శ్రీనివాసరావు ఏమీ పట్టించుకోకుండా వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.Top