జగన్ పై సంచలన కామెంట్స్ చేసిన ఏపీ కాంగ్రెస్ నేత ..!

జగన్ పై సంచలన కామెంట్స్ చేసిన ఏపీ కాంగ్రెస్ నేత ..!

వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర చివరి దశకు చేరుకున్న క్రమంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చివరిగా జరిగే భారీ బహిరంగ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంటే మరోపక్క జగన్ పై వివిధ పార్టీల నేతలు వరుసగా మాటలు దాడులు పెంచారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రఘువీరారెడ్డి జగన్ పాదయాత్ర గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసమస్యలు అంటూ కలరింగ్ ఇస్తూ అధికార దాహం కోసం జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టారని ఆరోపించారు. ఎన్ని పాదయాత్రలు చేసిన జగన్ కి త్వరలోనే రాష్ట్ర ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

ప్రజా సమస్యలపై పోరాడాలని అసెంబ్లీ కి వెళ్లాలని ప్రశ్నించే అవకాశం ప్రజలు అక్కడ ఇచ్చారని అంత అవకాశాన్ని చేజార్చుకుంటే అది కచ్చితంగా చేతకానితనమే అవుతుందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అమలు చేసేశక్తి , అవకాశం జాతీయ పార్టీకి మాత్రమే వుంటుందని తెలిపారు. ప్రత్యేక హోదా ఇచ్చేవారికే జగనా మద్దతు తెలుపుతాననడం నిజముగా సిగ్గు చేటు అది. జగన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని బయట పుకార్లు పుట్టిస్తున్నారు కానీ చీకట్లో మంతనాలు బాగానే జరుపుతున్నాడు. ఇటీవల అనంతపురంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రఘువీరా రెడ్డి వ్యాఖ్యలు చేశారు.Top